<font face="mangal" size="3">సికింద్రాబాద్ లోని గోకుల్ కోఆపరేటివ్ అర్బķ - ఆర్బిఐ - Reserve Bank of India
సికింద్రాబాద్ లోని గోకుల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. కు జారీ చేసిన ఉత్తర్వులను పొడిగించిన రిజర్వ్ బ్యాంక్
ఏప్రిల్ 03, 2017 సికింద్రాబాద్ లోని గోకుల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. కు జారీ చేసిన భారత రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (సహకార సంఘాలకు వర్తించే) సెక్షన్ 35A ద్వారా సంక్రమించిన అధికారాలను అనుసరించి ఏప్రిల్ 04, 2017న వ్యాపార లావాదేవీలు ముగిసిన నాటి నుంచి గోకుల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, సికింద్రాబాద్ కు జారీ చేసిన ఆదేశాలను జూన్ 30, 2017వరకు, సమీక్షకు లోబడి, పొడిగించినది. ఆ ఆదేశాలలోని ఇతర నియమ నిబంధనలలో మాత్రం ఎలాంటి మార్పులూ ఉండవు. మార్పులు చేసినట్టి మార్చి 24, 2017న జారీ చేసిన ఉత్తరువుల కాపీని ఆసక్తి కలిగిన ప్రజల పరిశీలనార్థం బ్యాంకు పరిసరాలలో ప్రదర్శించడం జరుగుతుంది. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్: 2016-17/2665 |