RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78502763

రూపీ సహకార బ్యాంక్ లిమిటెడ్., పూణే ఫై జారీ చేసిన నిర్దేశాలను (డైరెక్షన్స్), భారతీయ రిజర్వు బ్యాంకు పొడిగించింది

తేదీ: మే 28, 2018

రూపీ సహకార బ్యాంక్ లిమిటెడ్., పూణే ఫై జారీ చేసిన నిర్దేశాలను (డైరెక్షన్స్),
భారతీయ రిజర్వు బ్యాంకు పొడిగించింది

మే 23, 2018 నాటి ఆదేశం DCBR.CO.AID/D-42/12.22.218/2017-18 ప్రకారం, భారతీయ రిజర్వు బ్యాంకు, రూపీ సహకార బ్యాంక్ లిమిటెడ్., పూణే ఫై జారీ చేసిన నిర్దేశాలను (డైరెక్షన్స్) జూన్ 01, 2018 నుండి ఆగష్టు 31, 2018 వరకు మూడునెలల వ్యవధి కొరకు సమీక్షాధికారాలతో పొడిగించింది. నిర్దేశాలు వాస్తవానికి ఫిబ్రవరి 22, 2013 నుండి ఆగస్టు 21, 2013 వరకు విధించబడ్డాయి మరియు ఎనిమిది సందర్భాల్లో ప్రతి ఆరు నెలల వ్యవధిలో మూడు మరియు ప్రతి మూడు నెలల వ్యవధిలో నాలుగు సందర్భాలలో పొడిగింపబడ్డాయి. చివరిగా ఆరు నెలల వ్యవధి కొరకు నవంబర్ 22, 2017 నుండి మే 31, 2018 వరకు పొడిగింపబడ్డాయి.

బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 లోని సెక్షన్ 56 తో కలిపి, సబ్ సెక్షన్ (1), సెక్షన్ 35 ఎ క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, నిర్దేశాలు విధించబడ్డాయి. జారీ చేసిన నిర్దేశం యొక్క నకలు, బ్యాంక్ ప్రాంగణంలో ఆసక్తిగల సభ్యుల పరిశీలన కోసం ప్రదర్శించబడతాయి.

జారీ చేయబడిన ఫై నిర్దేశాలను, తప్పనిసరిగా పాటించవలసిన మార్గదర్శకాలను/ఆదేశాలను బ్యాంకు ఉల్లంఘించినందుకు మాత్రమే తప్ప, భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా బ్యాంకింగ్ లైసెన్సు రద్దు చేసే చర్యగా భావించరాదు. ఆర్ధిక స్థితి మెరుగుపడేంతవరకు, పరిమితులకు లోబడి బ్యాంకు తన బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తుంది. భారతీయ రిజర్వు బ్యాంకు ఈ నిర్దేశాలలో మార్పులను పరిస్థితుల మీద ఆధారపడి సవరించవచ్చును.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/3106

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?