<font face="mangal" size="3px">మ‌హారాష్ట్ర‌లోని నాందేడ్ జిల్లా ముఖేడ్‌కు & - ఆర్బిఐ - Reserve Bank of India
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్కు చెందిన శ్రీ సాయి పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్ కు జారీ చేసిన ఉత్తరువులను కొనసాగించిన RBI
అక్టోబర్ 03, 2016 మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్కు చెందిన శ్రీ సాయి పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్ కు జారీ చేసిన ఉత్తరువులను కొనసాగించిన RBI భారతీయ రిజర్వ్ బ్యాంక్ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్కు చెందిన శ్రీ సాయి పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్ కు జారీ చేసిన ఉత్తరువులను సెప్టెంబర్ 30, 2016న వ్యాపార లావాదేవీలు ముగిసినప్పటి నుంచి మరో మూడు నెలల పాటు అనగా డిసెంబర్ 31, 2016 వరకు, సమీక్షకు లోబడి, కొనసాగించింది. ఈ బ్యాంకు జులై 01, 2015 నుంచి ఉత్తర్వుల కింద ఉంది. ఆ ఉత్తరువులను గతంలో రెండు సందర్భాలలో తొమ్మిది నెలల పాటు పొడిగించారు. ఆ ఉత్తరువులను బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (AACS) లోని సెక్షన్ 35A, సబ్ సెక్షన్ (1) కింద జారీ చేయడం జరిగింది. ఆ ఉత్తరువుల కాపీని ఆసక్తి కలిగిన ప్రజల పరిశీలనార్థం బ్యాంకు పరిసరాలలో ప్రదర్శించడం జరుగుతుంది. భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీచేసిన ఆ ఉత్తరువులను అనుసరించి రిజర్వ్ బ్యాంకు ఆ బ్యాంకు యొక్క బ్యాంకింగ్ లైసెన్సును రద్దు చేసినట్లు భావించరాదు. ఆ బ్యాంకు యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడేంతవరకు అది కొన్ని ఆంక్షలతో తన బ్యాంకింగ్ కార్యకలాపాలను కొనసాగించవచ్చు. పరిస్థితులను బట్టి రిజర్వ్ బ్యాంక్ ఆ ఉత్తర్వులను సమీక్షించవచ్చు. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్ : 2016-17/840 |