RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78524269

ది ఆదూర్ కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., ఆదూర్, కేరల - రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన నిర్దేశాల గడువు మరొక ఆరు నెలలుపొడిగింపు

తేది: 10/05/2019

ది ఆదూర్ కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., ఆదూర్, కేరల - రిజర్వ్ బ్యాంక్
జారీచేసిన నిర్దేశాల గడువు మరొక ఆరు నెలలుపొడిగింపు

రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్‌ 35A (సెక్షన్‌ 56 తో కలిపి), క్రింద ది ఆదూర్ కోఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., ఆదూర్‌కు నవంబర్ 02, 2018 తేదీన నిర్దేశాలు జారీచేసినది. ఈ నిర్దేశాలు, మే 09, 2019 వరకు అమలులో ఉన్నవి.

ఈ నిర్దేశాలను అనుసరించి, ఖాతాదారులు, సేవింగ్స్ బ్యాంక్/కరెంట్ అకౌంట్/ఏ ఇతర డిపాజిట్ ఖాతా (ఏపేరుతో పిలువబడినా) నుండి, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు లోబడి రూ. 2,000/- (రెండువేల రూపాయిలు) మించకుండా, విత్‌డ్రా చేయుటకు అనుమతించబడుతుంది. ఇంతేగాక, ది ఆదూర్ కోఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., ఆదూర్, రిజర్వ్ బ్యాంక్ లిఖితపూర్వక అనుమతి లేనిదే, నవంబర్ 02, 2018 తేదీన జారీచేసిన ఆదేశాలను అతిక్రమించి, అప్పులు, రుణాలు జారీ చేయుట/నవీకరించుట; పెట్టుబడులు పెట్టుట; అప్పులు, క్రొత్త డిపాజిట్లు స్వీకరించుటతో కలిపి ఎటువంటి భారము అంగీకరించుట; వారు చేసిన రుణాలు తిరిగి చెల్లించుటకుగాని లేక మరొక కారణంగాగాని ఎటువంటి చెల్లింపులు చేయుట లేక చెల్లించుటకు అంగీకరించుట; రాజీ లేక ఇతర ఒప్పందాలు కుదుర్చుకొనుట; వారి ఆస్తులను అమ్ముట, బదిలీ చేయుట లేక ఇతర మార్గాలలో ఇచ్చివేయుట, చేయరాదు.

ప్రజా శ్రేయస్సుదృష్ట్యా, ఆదూర్ కోఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., ఆదూర్‌కు జారీచేసిన నిర్దేశాలు మరొక ఆరు నెలలు పొడిగించడం అవసరమని, రిజర్వ్ బ్యాంక్ భావించింది. తదనుసారంగా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సబ్-సెక్షన్‌ 1, సెక్షన్‌ 35A (సెక్షన్‌ 56 తో కలిపి), తమకు దఖలుపరచిన అధికారాలతో, నవంబర్ 02, 2018 తేదీన ఆదూర్ ఆర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంకుకు జారీచేయబడి, మే 09, 2019 వరకు అమలులోఉన్న, నిర్దేశాల కాల పరిమితి మరొక ఆరు నెలలు (అనగా మే 10, 2019 నుండి నవంబర్ 09, 2019 వరకు), పొడిగించబడ్డాయని ఇందుమూలముగా ఆదేశించడమైనది. ఈ ఆదేశాలు సమీక్షించవచ్చు. పైన పేర్కొన్న నిర్దేశాల్లోని ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పూ లేదు.

శైలజా సింగ్
డిప్యూటీ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2018-2019/2649

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?