<font face="mangal" size="3">బ్రహ్మవర్త్ కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్  - ఆర్బిఐ - Reserve Bank of India
బ్రహ్మవర్త్ కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కాన్‌పూర్, ఉత్తర ప్రదేశ్‌కు, రిజర్వ్ బ్యాంక్
జారీ చేసిన నిర్దేశాల గడువు పొడిగింపు
జనవరి 06, 2017 బ్రహ్మవర్త్ కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కాన్‌పూర్, ఉత్తర ప్రదేశ్‌కు, రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్, బ్రహ్మవర్త్ కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు జారీ చేసిన నిర్దేశాల గడువు, మరొక ఆరు నెలలపాటు-జనవరి 07, 2017 నుండి జులై 06, 2017 వరకు, పొడిగించింది. అయితే, ఇది సమీక్షించవచ్చు. బ్యాంక్, జులై 07, 2015 నుండి, బ్యాంకింగ్ నియంత్రణంచట్టం 1949 (కో-ఆపరేటివ్ బ్యాంకులకు వర్తించేమేరకు), సెక్షన్ 35A క్రింద జారీ చేసిన నిర్దేశాలకు లోబడి ఉంది. పైన పేర్కొన్న నిర్దేశాలు మార్చబడి, వాటి గడువు జనవరి 06, 2017 వరకు పొడిగించబడింది. డిసెంబర్ 30, 2016 తేదీన జారీ చేసిన నిర్దేశాల అనుసారంగా, ఈ గడువు మరో ఆరునెలలు - జులై 06, 2017 వరకు పొడిగించబడింది. డిసెంబర్ 30, 2016 తేదీన జారీ చేసిన ఆదేశాల ప్రతి, ప్రజల సమాచారంకోసం, బ్రహ్మవర్త్ బ్యాంక్ ఆవరణలో ప్రదర్శించబడింది. కేవలం నిర్దేశాల్లో మార్పు చేసినందువల్ల, బ్యాంక్ ఆర్థిక స్థితి మెరుగుపడిందనిగాని, దిగజారిందనికాని భావించరాదు. సందర్భానుసారంగా, రిజర్వ్ బ్యాంక్, ఈ నిర్దేశాల్లో మార్పు చేయవచ్చు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2016-2017/1807 |