<font face="mangal" size="3">ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన బ్రహ్ķ - ఆర్బిఐ - Reserve Bank of India
ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన బ్రహ్మవర్త్ కమర్షియల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కు ఆర్.బీ.ఐ జారీ చేసిన ఆదేశాలను మార్చ్ 06, 2018 వరకు పొడిగింపు
నవంబర్ 06, 2017 ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన బ్రహ్మవర్త్ కమర్షియల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కు భారతీయ రిజర్వు బ్యాంక్ ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన బ్రహ్మవర్త్ కమర్షియల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కు జారీ చేసిన ఆదేశాలను మరో నాలుగు నెలలపాటు నవంబర్ 07, 2017 వ తేదీ నుండి మార్చ్ 06, 2018 వ తేదీ వరకు సమీక్షకు లోబడి పొడిగించిoది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35 A (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధన ప్రకారం, ఈ బ్యాంకు ను జులై 07, 2015 నుండి ఆదేశాల క్రింద ఉంచడం జరిగింది. వీటి గడువును నవంబర్ 01, 2017 ఆదేశాల ప్రకారం మార్చ్ 06, 2018 వరకు పొడిగించడం జరిగింది. నవంబర్ 01, 2017 ఆదేశాల నకలును ప్రజల పరిశీలనార్ధం బ్యాంకు పరిసరాలలో ఉంచడం జరుగుతుంది. రిజర్వు బ్యాంకు చే జారీ చేయబడిన ఆదేశాలు మరియు మార్పుల ననుసరించి పైన పేర్కొన్న బ్యాంకు యొక్క ఆర్ధిక పరిస్థితి చెప్పుకోదగిన విధంగా మెరుగుపడిందని గాని క్షీణించినదని గాని పరిగణింపరాదు. పరిస్థితులను బట్టి రిజర్వు బ్యాంక్ తమ ఆదేశాలలో మార్పు చేసే అవకాశాన్నిపరిశీలించవచ్చును. అనిరుధ డి. జాధవ్ ప్రెస్ రిలీజ్: 2017-2018/1251. |