<font face="mangal" size="3">ది సూరి ఫ్రెండ్స్ యూనియన్‌ కో-ఆపరేటివ్ బ్యాij - ఆర్బిఐ - Reserve Bank of India
ది సూరి ఫ్రెండ్స్ యూనియన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సూరి, పశ్చిమ బెంగాల్కు, రిజర్వ్
బ్యాంక్ జారీ చేసిన నిర్దేశాల గడువు పొడిగింపు
జనవరి 10, 2017 ది సూరి ఫ్రెండ్స్ యూనియన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సూరి, పశ్చిమ బెంగాల్కు, రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్, ది సూరి ఫ్రెండ్స్ యూనియన్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, సూరి, పశ్చిమ బెంగాల్కు జారీ చేసిన నిర్దేశాల గడువు, మరొక ఆరు నెలలపాటు, ఈ క్రింది పాక్షిక మార్పులతోబాటు, పొడిగించింది: (i) ఒక్ డిపాజిటర్ ₹ 50,000 మించకుండా ఖాతా నుండి తీసుకోవడానికి అనుమతించవచ్చు. అయితే ఆ డిపాజిటర్, బ్యాంకుకు ఏ విధంగానైనా రుణపడి ఉంటే అనగా బాకీదారుగాగానీ, పూచీదారుగాగానీ (డిపాజిట్లపై రుణాలతో కలిపి) ఈ సొమ్ము అట్టి రుణ ఖాతాలకు ముందు చెల్లువేయాలి. (ii) రుణ ఒప్పందం నియమ నిబంధనలలో, ఫిక్స్డ్ డిపాజిట్లలోని సొమ్ము, రుణ ఖాతాకు చెల్లుబాటు/సర్దుబాటు చేయవచ్చు అన్న అంశం గనుక ఉంటే, అట్టి మొత్తాన్ని, కొన్ని అదనపు నిబంధనలతో, రుణ ఖాతాలో ఉన్న బకాయి మేరకు సర్దుబాటు చేయవచ్చు. (iii) ప్రస్తుతం సక్రమ, సెక్యూర్డ్ సి సి అకౌంట్ల (డైరెక్టర్లకు సంబంధించినవి ఉంటే, వాటిని మినహాయించి) పరిమితి, ప్రస్తుత నియమ నిబంధనలతో నవీకరించుటకు అనుమతించబడినది. తదనుసారంగా, రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సెక్షన్ 35A, సబ్ సెక్షన్ (1)(2) ద్వారా తమకు దఖలుపరచబడిన అధికారాలతో, ది సూరి ఫ్రెండ్స్ యూనియన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సూరి, పశ్చిమ బెంగాల్కు, మార్చ్ 28, 2014 న జారీ చేయబడి తదుపరి మార్పులు చేయబడిన (చివరి మార్పు జూన్ 29, 2016) నిర్దేశాలు మరో ఆరు నెలలు అనగా జనవరి 7, 2017 నుండి జూలై 06, 2017 (పైన తెల్పిన మార్పులతో) అమలులో ఉండాలని ఇందుమూలముగా ఆదేశించడమైనది. దీనిని పునస్సమీక్షించవచు. పైన సూచించిన నిర్డేశంలోని ఇతర షరతులు నిబంధనలలో, ఎట్టి మార్పు లేదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2016-2017/1839 |