RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78501428

భారత్ బిల్ పేమెంట్ వ్య‌వ‌స్థ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU) గా అథ‌రైజేష‌న్ కొర‌కు దర‌ఖాస్తుల చివ‌రి తేదీ గ‌డువును పొడిగించిన RBI

తేదీ: నవంబ‌ర్ 13, 2015

భారత్ బిల్ పేమెంట్ వ్య‌వ‌స్థ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU) గా అథ‌రైజేష‌న్ కొర‌కు
దర‌ఖాస్తుల చివ‌రి తేదీ గ‌డువును పొడిగించిన RBI

భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ భారత్ బిల్ పేమెంట్ వ్య‌వ‌స్థ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU) గా అథ‌రైజేష‌న్ కొర‌కు దర‌ఖాస్తుల చివ‌రి తేదీ గ‌డువును గ‌తంలో ఉన్న నవంబ‌ర్ 20, 2015 నుండి డిసెంబ‌ర్ 18, 2015 కు పొడిగించింది. వివిధ సంస్థ‌లు గ‌డువులోపు ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించ‌డంలో ఉన్న ఇబ్బందులను వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో ఈ చ‌ర్య తీసుకో్వ‌డం జ‌రిగింది.

ఇప్పుడు ద‌ర‌ఖాస్తుల‌ను డిసెంబ‌ర్ 18, 2015 వ్యాపార లావాదేవీలు ముగిసే వ‌ర‌కు స్వీక‌రిస్తారు. అయితే, న‌వంబ‌ర్ 20, 2015 వ్యాపార లావాదేవీలు ముగిసే వ‌ర‌కు వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ మొద‌ట ప‌రిశీలిస్తుంద‌ని గుర్తించాలి.

ప్ర‌స్తుతం భార‌త్ బిల్ పేమెంట్ వ్య‌వ‌స్థ (BBPS) ప‌రిధిలో బిల్ పేమెంట్ కార్య‌క‌లాపాలు చేప‌డుతున్న బ్యాంకులు, నాన్ బ్యాంకులు భారత్ బిల్ పేమెంట్ ఆప‌రేటింగ్ యూనిట్‌(BBPOU)లుగా లేదా అధీకృత BBPOU ఏజెంట్లుగా పాల్గొన‌వ‌చ్చు. BBPOU కావాల‌నుకుంటున్న సంస్థ‌లు పొడిగించిన గ‌డువులోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

BBPS అభివృద్ధి, ఎదుగుద‌ల‌, విస్తృతి యొక్క ప‌రిధి ఆధారంగా, రిజ‌ర్వ్ బ్యాంక్ తిరిగి BBPOU ల అథ‌రైజేష‌న్‌/ఆమోదం కొర‌కు భ‌విష్య‌త్తులో ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించ‌వ‌చ్చు.

ఆస‌క్తి క‌లిగిన సంస్థ‌ల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చేందుకు, రిజర్వ్ బ్యాంక్ భార‌త్ బిల్ పేమెంట్ వ్య‌వ‌స్థ‌పై కొన్ని ‘త‌ర‌చుగా అడిగే ప్ర‌శ్న‌ల’‌ను త‌న వెబ్ సైట్ లో పొందుప‌ర‌చింది. ఏవైనా ప్ర‌త్యేక ప్ర‌శ్న‌లు ఉన్న‌ట్ల‌యితే డిసెంబర్ 11, 2015 వ్యాపార లావాదేవీలు ముగిసే స‌మ‌యం వ‌ర‌కు వాటిని మెయిల్ చేయ‌వ‌చ్చు.

అల్ప‌నా కిల్లావాలా
ప్రిన్సిప‌ల్ చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌

ప్రెస్ రిలీజ్: 2015-2016/1148

సంబంధిత ప్రెస్ రిలీజ్
అక్టోబ‌ర్ 20, 2015 అధీకృత‌ భారత్ బిల్ పేమెంట్ వ్య‌వ‌స్థ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU) గా పని చేసేందుకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న RBI

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?