RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
ODC_S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78498138

రిజర్వ్ బ్యాంక్‌, ఇండియన్‌ మర్కెన్టైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., లక్నో, ఉత్తర్ ప్రదేశ్‌కు జారీ చేసిన నిర్దేశాల గడువు పొడిగింపు

తేదీ: సెప్టెంబర్ 08, 2017

రిజర్వ్ బ్యాంక్‌, ఇండియన్‌ మర్కెన్టైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., లక్నో, ఉత్తర్ ప్రదేశ్‌కు
జారీ చేసిన నిర్దేశాల గడువు పొడిగింపు

రిజర్వ్ బ్యాంక్, ఇండియన్‌ మర్కంటైల్ కో-ఆపరేటివ్‌ బ్యాంక్ లి. లక్నోకు జారీచేసిన నిర్దేశాల కాలపరిమితి మరొక ఆరునెలలపాటు (అనగా, సెప్టెంబర్ 12, 2017 నుండి మార్చ్ 11, 2018 వరకు), సమీక్షకు లోబడి, పొడిగించింది. సదరు బ్యాంకు, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సబ్-సెక్షన్‌ (1), సెక్షన్‌ 35 A క్రింద, జూన్‌ 04, 2014 జారీ చేసిన ఆదేశాలద్వారా, జూన్‌ 12, 2014 తేదీనుండి, నిర్దేశాలకు లోబడి ఉన్నది.

జులై 30, 2014; డిసెంబర్ 08, 2014; జూన్‌ 02, 2015; సెప్టెంబర్ 07, 2015; అక్టోబర్ 19, 2015; డిసెంబర్ 07, 2015; మార్చ్ 04, 2016; సెప్టెంబర్ 02, 2016; నవంబర్ 25, 2016 మరియు మార్చ్ 09, 2017 తేదీలలో జారీ చేసిన ఆదేశాల ద్వారా పైన తెలిపిన నిర్దేశాలలో సవరణలు / నిర్దేశాల కాలపరిమితి పొడిగింపు, చేయబడ్డాయి. చివరిసారిగా సెప్టెంబర్ 11, 2017 వరకు పొడిగించబడ్డ నిర్దేశాల కాలపరిమితి, సెప్టెంబర్ 01, 2017 న జారీచేసిన ఆదేశాల ద్వారా, మరొకసారి, ఆరు నెలల పాటు (అనగా సెప్టెంబర్ 12, 2017 నుండి మార్చ్ 11, 2018 వరకు) సవరణలకు లోబడి, పొడిగించబడినది. సెప్టెంబర్ 01, 2017న జారీచేసిన ఆదేశాల ప్రతి, ప్రజల సమాచారంకోసం, ఇండియన్‌ మర్కన్టైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో ప్రదర్శించబడినది.

రిజర్వ్ బ్యాంక్, పైన తెలిపిన సవరణలు చేసినంత మాత్రాన, బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడిందనిగాని / దిగజారిందనిగాని, భావించరాదు. పరిస్థితులననుసరించి, రిజర్వ్ బ్యాంక్, పై ఆదేశాల్లో, సవరణలు చేయవచ్చు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/683

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?