<font face="mangal" size="3">ఇండియన్ మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిట - ఆర్బిఐ - Reserve Bank of India
ఇండియన్ మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, లక్నో, ఉత్తరప్రదేశ్ ఫై నిర్దేశాల (డైరెక్షన్స్) పొడిగింపు
మార్చ్ 09, 2018 ఇండియన్ మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, లక్నో, ఉత్తరప్రదేశ్ ఫై నిర్దేశాల (డైరెక్షన్స్) పొడిగింపు ఇండియన్ మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, లక్నో, ఉత్తరప్రదేశ్ ఫై భారతీయ రిజర్వు బ్యాంకు విధించిన నిర్దేశాల (డైరెక్షన్స్) అమలు మరో 6 నెలలకు అంటే మార్చ్ 12, 2018 నుండి సెప్టెంబర్ 11, 2018 వరకు, సమీక్షకు లోబడి పొడిగించడమైనది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 లోని సెక్షన్ 35A (సహకార సొసైటీలకు వర్తించేది) యొక్క ఉప విభాగం (1) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, సదరు బ్యాంకు జూన్ 04, 2014 నాటి ఆదేశం ద్వారా జూన్ 12, 2014 నుండి నిర్దేశాల క్రింద ఉంచబడింది. పైన విధించిన నిర్దేశం తగిన మార్పులతో, కాలానుసారంగా జులై 30, 2014, డిసెంబరు 08, 2014, జూన్ 02, 2015, సెప్టెంబరు 07, 2015, అక్టోబరు 19, 2015, డిసెంబరు 07, 2015, మార్చి 04, 2016, సెప్టెంబరు 02, 2016, నవంబర్ 25, 2016, మార్చి 09, 2017 మరియు సెప్టెంబరు 01, 2017 నాటి ఆర్.బి.ఐ ఆదేశాల ద్వారా పొడిగించడమైనది. చివరగా ఇచ్చిన ఆదేశం ద్వారా మార్చ్ 11, 2018 వరకు పొడిగించబడిన నిర్దేశాలు, మరో 6 నెలల పాటు అంటే మార్చ్ 12, 2018 నుండి సెప్టెంబరు 11, 2018 వరకు మార్చ్ 06, 2018 న జారీ చేసిన ఆదేశం ద్వారా, సమీక్ష కు లోబడి పొడిగింపబడింది. మార్చ్ 06, 2018 న జారీ చేసిన పొడిగింపబడిన నిర్దేశం యొక్క నకలు, బ్యాంకు యొక్క ప్రాంగణంలో, ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది. మార్పులతో జారీ చేయబడిన ఫై నిర్దేశాలను, బ్యాంక్ యొక్క ఆర్ధిక స్థితిలో మెరుగుదలను లేదా క్షీణతకు కొలమానంగా తీసుకోకూడదు. పరిస్థితుల మీద ఆధారపడి, రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్దేశాల మార్పులను పరిశీలిస్తుంది. అనిరుద్ధ డి. జాధవ్ పత్రికా ప్రకటన: 2017-2018/2411 |