<font face="mangal" size="3px">మెర్కంటైల్ అర్బ‌న్ కో-ఆప‌రేటివ్ బ్యాంక్ లి.,  - ఆర్బిఐ - Reserve Bank of India
మెర్కంటైల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., మీరట్, ఉత్తర ప్రదేశ్ కు జారీ చేసిన ఉత్తరువులను పొడిగించిన RBI
అక్టోబర్ 05, 2016 మెర్కంటైల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., మీరట్, ఉత్తర ప్రదేశ్ కు జారీ చేసిన ఉత్తరువులను పొడిగించిన RBI భారతీయ రిజర్వ్ బ్యాంక్ మెర్కంటైల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., మీరట్, ఉత్తర ప్రదేశ్ కు జారీ చేసిన ఉత్తరువులను అక్టోబర్ 06, 2016 నుంచి ఏప్రిల్ 05, 2017 వరకు, సమీక్షకు లోబడి, ఆరు నెలల పాటు పొడిగించింది. ఆ బ్యాంకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (AACS) లోని సెక్షన్ 35A, సబ్ సెక్షన్ (1) కింద సెప్టెంబర్ 30, 2015న జారీ చేసిన ఉత్తరువును అనుసరించి అక్టోబర్ 06, 2015 నుంచి ఉత్తరువుల కింద ఉంది. పైన పేర్కొన్న ఉత్తరువులను RBI మార్చి 29, 2016న జారీ చేసిన ఉత్తరువుల ద్వారా దాని గడువును పొడిగించారు/సవరించారు . చివరిసారిగా, అక్టోబర్ 05, 2016న పొడిగించిన ఆ ఉత్తరువుల గడువును సవరించిన ఉత్తరువుల ద్వారా మరో ఆరు నెలల కాలానికి అనగా అక్టోబర్ 06, 2016 నుంచి ఏప్రిల్ 05, 2017 వరకు, సమీక్షకు లోబడి, పొడిగించారు. పైన పేర్కొన్న ఉత్తరువులలోని నియమ నిబంధనలలో ఎలాంటి మార్పు ఉండదు. సెప్టెంబర్ 30, 2016 నాటి ఉత్తరువుల కాపీని ఆసక్తి కలిగిన ప్రజల పరిశీలనార్థం బ్యాంకు పరిసరాలలో ప్రదర్శించడం జరుగుతుంది. భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీచేసిన ఆ ఉత్తరువులోని మార్పులను అనుసరించి రిజర్వ్ బ్యాంకు ఆ బ్యాంకు యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడినట్లు గానీ లేదా మరింత దిగజారినట్లు గానీ భావించరాదు. పరిస్థితులను బట్టి రిజర్వ్ బ్యాంక్ ఆ ఉత్తర్వులను సమీక్షించవచ్చు. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్ : 2016-17/863 |