రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పూణె కు, రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నిర్దేశాల కాల వ్యవధి పొడిగింపు
ఆగస్టు 21, 2015 రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పూణె కు, రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నిర్దేశాల కాల వ్యవధి పొడిగింపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్ట్ 20, 2015 తేదీన DCBR.CO.AID/D-10/12.22.218/2015-16 ద్వార, రుపీ కో ఆపరేటివ్ బ్యాంక్ కు ఇంతకు ముందు జారీ చేసిన నిర్దేశాల్ని మరొక ఆరు నెలలు, అనగా ఆగస్ట్ 22, 2015 నుంచి ఫిబ్రవరి 21, 2016 వరకు పొడిగించింది. అయితే, ఈ నిర్ణయాన్ని సమీక్షించవచ్చు. మొదట ఫిబ్రవరి 22, 2013 నుండి ఆగస్టు 21, 2013 వరకు విధించిన నిర్దేశాలని, ఆరు నెలల చొప్పున మూడుమార్లు, మూడు నెలల చొప్పున రెండుమార్లు ఇంతకు మునుపే పొడిగించడం జరిగింది. చివరి మూడునెలల పొడిగింపు మే 21, 2015 నుండి ఆగస్టు 21, 2015 వరకు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ ఏక్ట్, 1949, సెక్షన్ 35 A, సబ్ సెక్షన్ (1) మరియు సెక్షన్ 56 ద్వారా రిజర్వ్ బ్యాంక్ కు సంక్రమించిన అధికారాలతో, ఈ నిర్దేశాలు జారీచేయడమైనది. ప్రజల సమాచారంకోసం, ఈ ఉత్తరువుల ప్రతి, రుపీ కో ఆపరే్టివ్ బ్యాంక్, పూణే, వారి ఆవరణలో ప్రదర్శించబడింది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశాలు జారీ చేయడమంటే, బ్యాంక్ యొక్క అనుమతి రద్దుచేసినట్లే అని భావించరాదు. బ్యాంక్ తమ ఆర్థిక పరిస్థితి మెరుగు పడే వరకు, కొన్ని ఆంక్షలతో బ్యాంకింగ్ కార్య కలాపాల్ని కొనసాగించవచ్చు. పరిస్థితుల్నిబట్టి ఈ నిర్దేశాలలో మార్పులుచేయడం గురించి ఆలోచించడం జరుగుతుంది. సంగీతా దాస్ పత్రికా ప్రకటన: 2015-16/467 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: