RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78471543

డిపాజిట్ల అక్రమ సేకరణ నిరోధానికి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌చే "సచేత్"  (सचेत) వెబ్‌సైట్ ప్రారంభం

ఆగస్ట్ 04, 2016

డిపాజిట్ల అక్రమ సేకరణ నిరోధానికి, భారతీయ
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌చే ‘సచేత్'  (सचेत) వెబ్‌సైట్ ప్రారంభం

'చట్ట విరుద్ధమైన కార్య కలాపాలకు పాలుపడే అపరాధులపై తక్షణ చర్యలు తీసుకొని, దోషులను శిక్షించి, సమస్యను ఉచితరీతిలో పరిష్కరించడం, ఇటువంటి మోసపూరిత సంస్థలు భవిష్యత్తులో అక్రమ లావాదేవీలు చేయకుండా నిరోధించడానికి, అతి ముఖ్యం. 'సచేత్' నియంత్రణాధికారులకు, ప్రజలకు ఇటువంటి సంస్థలపై సకాలంలో సమాచారం అందించి, తద్వారా, వారు చెమటోడ్చి సంపాదించిన సొమ్ము, నికార్సయిన సంస్థలలో డిపాజిట్ చెయ్యడానికి సహాయపడుతుందని, నేను ఆశిస్తున్నాను'.

డా. రఘురాం జి రాజన్‌, భారతీయ రిజర్వ్  బ్యాంక్ గవర్నర్, ఈ రోజు 'సచేత్' ప్రారంభిస్తూ, పైవిధంగా తెలిపారు. వారు ఈ వెబ్‌సైట్‌ద్వారా ప్రజలు డిపాజిట్లు స్వీకరించడానికి అనుమతించబడ్డ సంస్థలయొక్క  సమాచారాన్ని పొందడమేగాక, అక్రమంగా డిపాజిట్లు అంగీకరిస్తున్న సంస్థలపై ఫిర్యాదు చేయవచ్చు, వాటి వివరాలు ఇతరులతో పంచుకోవచ్చు. ఈ వెబ్‌సైట్, నియంత్రణాధికారులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సమన్వయాన్ని పెంచి, దగాకోరు సంస్థలు అనధికారంగా డిపాజిట్లు స్వీకరించడాన్ని నిరోధించడంలో ఉపయోగపడుతుందన్నారు. గవర్నర్, SLCCలను  పునరుత్తేజింప చేయడంలో, శ్రీ యు. కె. సిన్హా, SEBI చైర్‌మన్‌; మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల పాత్రను కొనియడారు.

వెబ్‌సైట్ యొక్క URL: www.sachet.rbi.org.in

శ్రీ ఎస్. ఎస్. ముంద్రా, డిప్యూటీ గవర్నర్, దీనిలోని విశేషతలను వివరిస్తూ,  ప్రజలు ఈవెబ్‌సైట్‌లో, డిపాజిట్లకై అభ్యర్థిస్తున్న సంస్థ, ఏదేని నియంత్రణా వ్యవస్థచే నమోదు చేయబడిందా, మరియు ఆ సంస్థ డిపాజిట్లు స్వీకరించడానికి అనుమతించబడిందా, అన్న విషయం రూఢి  చేసుకోవచ్చని తెలిపారు.   నియంత్రణాధికారులు, వివిధ సంస్థలు పాటించడంకోసం విధించిన నిబంధనలు, ఈ వెబ్‌సైట్‌లో పేర్కొనబడ్డాయి. పైగా, ఏదైనా సంస్థ, చట్టవిరుద్ధంగా సొమ్ము స్వీకరించినా/ తిరిగి చెల్లించడంలో విఫలమైనా,  ప్రజలు ఈసైట్ ద్వారా ఒక ఫిర్యాదు దాఖలు చేసి, దాని జాడ తెలుసుకొనవచ్చు.   ఇటువంటి సంస్థలపై సమాచారం ఈపోర్టల్ ద్వారా, ఇతరులతో పంచుకోవచ్చు.

ఈ వెబ్‌సైట్‌లో, SLCC ల 'సన్నిహిత వినియోగదారుల వర్గం' (closed user group for SLCC) కోసం ఒక విభాగం ఉంది. దీనిద్వారా వారు, వారి వ్యవహారాలకు సంబంధించిన, మార్కెట్ సమాచారం (market intelligence) / ఇతర సమాచారం మాత్రమేగాక వారి సమావేశాల అజెండా, మినిట్స్ దేశ వ్యాప్తంగా, అదే క్షణంలో  (real time basis)  పంచుకోవచ్చు. SLCCలు మరింత సమర్థవంతంగా పనిచెయ్యడానికి, ఇంకా అనధికారికంగా నిధులు సేకరించే అక్రమ కార్యకలపాలు నిరోధించడంలో ఈసైట్ శక్తివంతమైన పాత్ర పోషిస్తుందని శ్రీ  ముంద్రా, ఆశాభావం వ్యక్తం చేశారు.

SEBI (Whole Time Member. SEBI), పూర్తికాల సభ్యులైన, శ్రీ రామన్‌, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వెబ్‌సైట్  ప్రారంభించడానికి శ్రమపడ్డ వారిని ప్రశంసిస్తూ, దగాకోరు సంస్థలు, ప్రజలనుండి డిపాజిట్లు స్వీకరించకుండా నిరోధించడానికి, దీనిపై ప్రజల అవగాహన పెంచడానికి, ఈ సైట్ ఎంతో తోడ్పడుతుందని అభిప్రాయ పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ , IRDA  ప్రతినిధుల వంటి ఇతర నియంత్రణ అధికారులు, వీడియో సమావేశం ద్వారా, ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.  రాష్ట్రాల  ప్రధాన కార్యదర్శులు, వీడియో సమావేశం ద్వారా ప్రారంభోత్సవంలో పాల్గొని, వివిధ ప్రతినిధి సంస్థల మధ్యసమన్వయాన్ని పెంపొందించడంలో ఎంతో ఉపయోగకారి అని, ఈ సైట్‌ను  స్వాగతించారు. వెబ్‌సైట్ వినియోగంగురించి, దాని ప్రధాన అంశాల ప్రాముఖ్యం గురించి ఒక చిన్న వీడియో చిత్రం, ప్రారంభోత్సవ సమయంలో ప్రదర్శించబడింది.

నేపథ్యం

అన్ని రాష్ట్రాల్లో /కేంద్ర పాలిత ప్రాంతాల్లో (Union Territories) రాష్ట్రస్థాయి సమన్వయ సంఘాలు (State Level Coordination Committees, SLCCs)  ఉన్నాయి. SLCC లలో సభ్యులుగా వివిధ నియంత్రణా సంస్థలు ఉంటాయి – భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI), నేషనల్ హౌసింగ్ బ్యాంక్, (NHB), ఇన్స్యూరెన్స్ రెగ్యలేటరీ అండ్ డెవెలప్‌మెంట్ అథారిటీ (IRDA), రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ROC), మరియు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు - హోమ్‌ డిపార్ట్‌మెంట్, ఆర్థిక విభాగము, న్యాయ విభాగము, వివిధ పోలీస్ అధికారులు. డిపాజిట్లు అక్రమంగా స్వీకరించడంపై పర్యవేక్షణ కొరకు, SLCCలు 2014 లో, పునర్వ్యవస్థీకరించబడ్డాయి. SLCCలు, అయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు/ కార్య నిర్వాహకులు /కేంద్రపాలిత ప్రాంతాల ఉన్నతాధికారుల నేతృత్వంలో, మరింత తరుచుగా సమావేశమై, నిధుల అక్రమ సేకరణకు పాల్పడుతున్న సంస్థలపై సమాచారాన్ని పంచుకొని, వారిపై సకాలంలో చర్యలు చేపట్టవలెను.

అల్పనా కిల్లావాలా
ప్రిన్సిపల్ అడ్వైజర్

పత్రికా ప్రకటన : 2016-2017/312  

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?