<font face="mangal" size="3">ఆర్‌బిఐ గవర్నర్ ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ - ఆర్బిఐ - Reserve Bank of India
ఆర్బిఐ గవర్నర్ ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ బ్యాంకుల ఎండి మరియు సిఇఓలతో
దృశ్యశ్రవణ మాధ్యమం ద్వారా సమావేశం
డిసెంబర్ 23, 2020 ఆర్బిఐ గవర్నర్ ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ బ్యాంకుల ఎండి మరియు సిఇఓలతో గవర్నర్, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) ప్రభుత్వ రంగ బ్యాంకుల మరియు ఎన్నికచేసిన ప్రైవేట్ రంగ బ్యాంకుల ఎండి మరియు సిఇఓలతో వరుసగా డిసెంబర్ 22 మరియు 23, 2020 తేదీలలో దృశ్యశ్రవణ మాధ్యమం ద్వారా సమావేశం జరిపారు. ఈ సమావేశాలలో ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్లు పాల్గొన్నారు. సమావేశ ప్రారంభపు తమ తొలి పలుకుల్లో, గవర్నర్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి స్పృశిస్తూ ఆర్ధిక కార్యకాలాపాలలో కొనసాగుతున్న పునరుజ్జీవనానికి మద్దతు ఇవ్వడంలో బ్యాంకింగ్ రంగ ప్రాముఖ్యతను నొక్కి వక్కాణించారు. ప్రత్యేకంగా ఆర్ధిక రంగాన్ని ఉద్దేశిస్తూ, మహమ్మారి పొడచూపిన నాటినుండి ఆర్థికవ్యవస్థలో స్థిరత్వం నకు మరియు విత్తరంగం నిలకడగా ఉండేందుకు ఆర్బిఐ చేపట్టిన పలు చర్యలను ఆయన ఉటంకించారు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి, బ్యాంకులు సావధానంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు. మూలధనం పెంచుకోవడం మరియు క్రియాశీలoగా కేటాయింపులు చేయడం ద్వారా వారి స్థితిస్థాపకత మరియు అప్పివ్వగల సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి తగు రీతిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇతర విషయాలతోపాటు, సమావేశంలో ఈ క్రింది విషయాలు చర్చించబడ్డాయి:
(యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2020-2021/820 |