<font face="mangal" size="3">భారత్ బిల్ పేమెంట్ వ్య‌వ‌స్థ‌ (BBPS) లో సెంట్ర‌ల్ - ఆర్బిఐ - Reserve Bank of India
భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ (BBPS) లో సెంట్రల్ యూనిట్ గా పని చేసేందుకు NCPI కు ‘ఇన్- ప్రిన్సిపుల్’ ఆమోదం తెలిపిన RBI
నవంబర్ 24, 2015 భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ (BBPS) లో సెంట్రల్ యూనిట్ గా పని చేసేందుకు NCPI కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ రోజు నుంచి భారత జాతీయ పేమెంట్ కార్పొరేషన్ (NCPI)కు భారత్ బిల్ పేమెంట్ సెంట్రల్ యూనిట్ (BBPCU)గా కార్యకలాపాలు నిర్వహించేందకు ‘ఇన్- ప్రిన్సిపుల్’ ఆమోదం ఇవ్వాలని నిర్ణయించింది. సమగ్ర బిల్ పేమెంట్ వ్యవస్థ అయిన BBPS దేశంలో బిల్ పేమెంట్ వ్యవస్థకు ఒక శ్రేణీయ నిర్మాణంగా పని చేస్తూ... కేవలం ఒకే బ్రాండ్ ఇమేజ్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా ఖాతాదారులు బిల్లులు చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తుంది. ఒక సెంట్రల్ యూనిట్ గా NCPI మొత్తం వ్యవస్థకు, దానిలో భాగస్వాములకు తగిన కార్యనిర్వాహక, సాంకేతిక, వాణిజ్య ప్రమాణాలను నిర్దేశించడమే కాకుండా, క్లియరింగ్, సెటిల్మెంట్ కార్యకలాపాలు చేపడుతుంది. ప్రస్తుత BBPS పరిధిలోకి విద్యుత్, నీరు, గ్యాస్, టెలిఫోన్, డైరెక్ట్-టు-హోమ్ తదితర వినియోగ బిల్లుల చెల్లింపులు వస్తాయి. ఈ అనుభవాన్ని ఆధారంగా చేసుకుని, భవిష్యత్తులో దీనిని స్కూల్/యూనివర్సిటీ ఫీజులు, మున్సిపాలిటీ పన్నులు మొదలైన పునరుక్త చెల్లింపులకు విస్తరిస్తారు. ఈ ఆపరేటింగ్ యూనిట్లు బిల్లులు/పునరుక్త చెల్లింపులకు అవకాశం కల్పించే సంస్థలుగా వ్యవహరిస్తాయి. బ్యాంకులు/బ్యాంకింగేతర సంస్థల నుంచి ఆపరేటింగ్ యూనిట్లుగా పని చేసేందుకు అథరైజేషన్/ఆమోదం తెలిపేందుకు రిజర్వ్ బ్యాంక్ దరఖాస్తులను ఆహ్వానించింది. అలాంటి అథరైజేషన్/ఆమోదం కోసం దరఖాస్తులు పంపుకోవడానికి చివరి తేదీ నవంబర్ 20, 2015. ఆ గడువును డిసెంబర్ 18, 2015 వరకు పొడిగించడం జరిగింది. నవంబర్ 20, 2015 వ్యాపార లావాదేవీలు ముగిసే సమయానికి రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగేతర సంస్థల నుంచి అథరైజేషన్ కొరకు 12 దరఖాస్తులు, బ్యాంకుల నుంచి BBPOUగా కార్యకలాపాలు నిర్వహహించేందుకు ఆమోదం కోరుతూ 18 విజ్ఞాపనలు అందుకుంది. ఆపరేటింగ్ యూనిట్లుగా అథరేజేషన్/ఆమోదం కోరుతూ వచ్చే దరఖాస్తులను రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం, డిసెంబర్ 18, 2015న వ్యాపార లావాదేవీలు ముగిసే వరకు స్వీకరిస్తుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నవంబర్ 28, 2014న జారీ చేసిన సర్క్యులర్ ద్వారా భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ (BBPS) ఏర్పాటు కోసం మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. దానిలో NCPI, BBPCU గా పని చేస్తుందని, BBPS కింద బహుళ భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్లు- BBPOU (ఆపరేటింగ్ యూనిట్)లు ఉంటాయని వెల్లడించడం జరిగింది. అనిరుధ డి.జాదవ్ ప్రెస్ రిలీజ్: 2015-2016/1234
|