RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78471381

2016 సంవత్సరానికి SBI మరియు ICICI బ్యాంకులను D-SIBలుగా గుర్తించిన రిజర్వ్ బ్యాంక్

ఆగస్ట్ 25, 2016

2016 సంవత్సరానికి SBI మరియు ICICI బ్యాంకులను D-SIBలుగా గుర్తించిన
రిజర్వ్ బ్యాంక్

భారతీయ రిజర్వ్ బ్యాంక్ SBI, ICICI బ్యాంకులను 2016 సంవత్సరానికి, డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంకులుగా (Domestic Systemically Important Banks) గుర్తించి, వారి బకెటింగ్ స్ట్రక్చర్‌ను (Bucketing Structure) యథాతథంగా మునుపటి సంవత్సరంవలెనే ఉంచింది. వీటికి అవసరమైన అదనపు కామన్‌ టైర్ 1 ఈక్విటీ (Tier 1 equity) ఇంతకు మునుపే ఏప్రిల్ 1, 2016 నుండి దశలవారీగా క్రమబద్ధీకరించబడింది (phased-in). ఇది ఏప్రిల్ 1, 2019 నుండి పూర్తిగా అమలులోకి వస్తుంది. అదనపు కామన్‌ టైర్ 1 ఈక్విటీ ఆవశ్యత, క్యాపిటల్ కన్సర్వేషన్‌ బఫర్ కంటె అదనంగా ఉంటుంది

2016 సం వత్సరానికి తాజా D-SIBల జాబితా:

బకెట్
(Bucket)
బ్యాంక్
(Banks)
అదనపు కామన్‌ ఈక్విటీ టైర్ 1ఆవశ్యత (రిస్క్ వైటెడ్ అసెట్ల లో శాతంగా)
Additional Common Equity Tier 1 requirement as a percentage of Risk Weighted Assets(RWAs)
5 - 1. 0%
4 - 0. 8%
3 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 0. 6%
2 - 0. 4%
1 ICICI Bank 0. 2%

నేపథ్యం

రిజర్వ్ బ్యాంక్ D-SIBల పరిధిని (framework) జులై 22, 2014 న సూచించింది. దీని ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ 2015 నుండి, ప్రతి సంవత్సరం ఆగస్ట్ ప్రారంభంలో D-SIBలు గా నిర్దేశించబడిన బ్యాంకుల పేర్లు ప్రకటించాలి. ఇంకా, D-SIB లను వారి వారి సిస్టమిక్ ఇంపార్టెన్స్ స్కోరుల ఆధారంగా, 4 బకెట్లలో ఉంచాలి. D-SIB ఉంచబడిన బకెట్ ఆధారంగా వాటికి అదనపు కామన్‌ ఈక్విటీ ఆవశ్యత వర్తిస్తుంది. ఇంతేగాక, ఒక విదేశీ బ్యాంక్ భారత దేశంలో శాఖ కలిగి ఉన్నట్లయితే, అది గ్లోబల్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్ (G-SIB). ఇట్టి బ్యాంక్, దాని RWAకి అనుగుణంగా, G-SIB లకు వర్తించే అదనపు CET 1 క్యాపిటల్ సర్‌చార్జ్ నిర్వహించ వలసి ఉంటుంది.

ఫ్రేమ్‌వర్క్ లో సూచించిన ప్రక్రియ మరియు మార్చ్ 31, 2015 న బ్యాంకులనుండి సేకరించిన గణాంకాల ఆధారంగా రిజర్వ్ బ్యాంక్, SBI, ICICI బ్యాంకులను ఆగస్ట్ 31, 2015 న D-SIBలుగా ప్రకటించింది. ఇవే ప్రాతిపదికలపై మార్చ్ 31, 2016 న సేకరించిన వివరాల ఆధారంగా, 2016 సంవత్సరానికి తిరిగి ఇవే బ్యాంకులను D-SIB లుగా ప్రకటించింది.

అల్పనా కిల్లవాలా
ప్రిన్సిపల్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2016-2017/495

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?