<font face="mangal" size="3">భదోహి అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., భదోహిప - ఆర్బిఐ - Reserve Bank of India
భదోహి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., భదోహిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్
జరిమానా విధించినది
ఏప్రిల్ 24, 2017 భదోహి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., భదోహిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ భారతీయ రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 47 (A)(1)(c) మరియు సెక్షన్ 46(4) క్రింద తమకు దఖలుపరచబడిన అధికారాలతో, భదోహి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., భదోహిపై ₹ 20,000 (ఇరవై వేల రూపాయిలు) నగదు జరిమానా విధించినది. నామమాత్ర సభ్యత్వానికి సంబంధించిన విధి విధానాలు, ఎక్స్పోషర్ నిబంధనలు, చట్టబద్ధ/ఇతర నిబంధనలు, ప్రూడెన్షియల్ ఇంటర్బ్యాంక్ గ్రోస్ ఎక్స్పోషర్ పరిమితులు మరియు ఇంటర్బ్యాంక్ కౌంటర్ పార్టీ పరిమితులు, మీ వినియోగదారుణ్ణి తెలిసికోండి మొదలైన అంశాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు/ మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన షో కాజ్ నోటీసుకు, బ్యాంక్ లిఖిత పూర్వకంగా జవాబు ఇచ్చినది. నిజానిజాలు పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగ్గవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ణయానికి వచ్చింది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2016-2017/2875 |