RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

129245168

మహారాష్ట్ర లోని అంబర్ నాధ్ కు చెందిన "ది అంబర్ నాధ్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.

'ధరావత్తు ఖాతాల నిర్వహణ - ప్రాధమిక (పట్టణ) సహకార బ్యాంకులు' కు సంబంధించి   భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల మహారాష్ట్ర లోని అంబర్ నాధ్ కు చెందిన "ది అంబర్ నాధ్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 31-03-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 3,00,000 (మూడు లక్షల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (i)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

ఈ బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిగతులపై 31-03-2023 తేదీన భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టబద్ధమైన విచారణ జరిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన మార్గ నిర్దేశకాలను సదరు బ్యాంక్ పాటించనట్లు గుర్తించి ఈ విషయంలో సదరు బ్యాంక్ తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల ఆధారంగా సదరు బ్యాంకు పై ఎందుకు చర్య తీసుకోకూడదో వివరించాలంటూ బ్యాంకుకు ఒక నోటీసును జారీ చేసింది.

ఈ నోటీసుకు బ్యాంకు వారు పంపిన ప్రత్యుత్తరము, దాఖలు పరచిన అదనపు సమాచారము మరియు మౌఖిక సమర్పణల ఆధారంగా సదరు బ్యాంక్ పై క్రింది ఆరోపణలను చేసింది.

1. బ్యాంక్ పొదుపు ఖాతాలలో కనీస నిల్వ ధనం కంటే తగ్గినప్పుడు ఖాతా దారులకు ఒక నెల ముందుగా నోటిస్ ఇవ్వలేదు.

2. వాడుకలో లేని ఖాతాలలో కనీస నిల్వ ధనం కంటే తగ్గినప్పుడు అపరాధ రుసుములు విధించింది.

3. వాడుకలో లేని ఖాతాలను వాడుకలోనికి తేవడానికి రుసుమును వసూలు చేసింది.

నియమ నిబంధనలను సరిగా పాటించని కారణంగా ఈ చర్య తీసుకోబడింది. అంతే కానీ బ్యాంకు యొక్క ఖాతాదారులు జరుపుతున్న లావాదేవీలు, ఒప్పందాలపై ఈ చర్య ఎటువంటి ప్రభావము చూపదు. అపరాధ రుసుము విధించినప్పటికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ సదరు బ్యాంక్ పైన మరేదైనా చర్య తీసుకొనే అధికారం కలిగి వుంటుంది.

(యోగీష్ దయాళ్)

ముఖ్య నిర్వహణ అధికారి

పత్రికా విడుదల: 2024-2025/156

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?