పత్రికా ప్రకటన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ పై భారతీయ రిజర్వు బ్యాంకు వారిచే ఆర్ధిక జరిమానా విధింపు - ఆర్‌బిఐ - Reserve Bank of India
పత్రికా ప్రకటన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ పై భారతీయ రిజర్వు బ్యాంకు వారిచే ఆర్ధిక జరిమానా విధింపు
ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, కేటాయింపుల విధివిధానాలు – మార్గదర్శక సూత్రాలుకు సంబంధించి ప్రుడెన్షియల్ నిబంధనల బలోపేతము, ప్రొవిజనింగ్,ఆస్తుల వర్గీకరణ మరియు బహిర్గత పరిమితులకు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు వారు జారీ చేసిన ఆదేశాలను పాటించనందులకు గాను ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ పై భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేదీ 10 అక్టోబర్ 2024 ద్వారా రు.1.00 లక్ష (అక్షరాల ఒక లక్ష రూపాయలు మాత్రమే) ఆర్ధిక జరిమానా విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 51(1) ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానాను విధించడమైనది.
ఈ బ్యాంకులో 31 మార్చ్ 2023 ఆర్ధిక స్థితి ఆధారంగా నాబార్డ్ వారు చట్టబద్ధ తనిఖీ నిర్వహించారు. ఆ తనిఖీ లో, భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాలను, ఈ బ్యాంకు పాటించలేదని గమనించి, తత్సంబంధిత పత్రములను పరిశీలించి, సదరు ఆదేశాలను ఉల్లంఘించినందులకు గాను ఈ బ్యాంకుపై జరిమానా ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వవలసినదిగా నోటీసు ఇవ్వడమైనది.
ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట, ఈ క్రింద తెలిపిన ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక జరిమానాను విధించడమైనది:
ఆదాయ గుర్తింపు మరియు ఆస్తుల వర్గీకరణ నిబంధనలను అనుసరించి కొన్ని ఋణ ఖాతాలను నిరర్ధక ఆస్తులుగా వర్గీకరణ చేయలేదు. ఈ చర్య భారతీయ రిజర్వు బ్యాంకు నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా అన్వయించుకోరాదు. మరియు, ఈ ఆర్ధిక జరిమానా విధించడం వలన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు పై భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకునే ఏ ఇతర చర్య పై ప్రతికూల ప్రభావం చూపదు.
(పునీత్ పంచోలీ) పత్రికా ప్రకటన: 2024-2025/1335 |