RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78509732

ఆక్సిస్ బ్యాంకు లిమిటెడ్ ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధించింది

మార్చ్ 05, 2018

ఆక్సిస్ బ్యాంకు లిమిటెడ్ ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధించింది

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) ద్వారా జారీచేయబడిన ‘ఆదాయం గుర్తింపు మరియు ఆస్తి వర్గీకరణ’ (IRAC) నిబంధనల మార్గదర్శకాలను/ఆదేశాలను ఉల్లంఘించినందుకు, భారతీయ రిజర్వు బ్యాంకు, ఆక్సిస్ బ్యాంకు లిమిటెడ్ ఫై ఫిబ్రవరి 27, 2018 న రూ.30 మిలియన్ జరిమానా విధించింది. ఈ జరీమానా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 47A(1)(c) తో కలిపి, సెక్షన్ 46(4)(1) లోని అధికారాలను వినియోగించుకొని, పైన ఉదహరించిన మార్గదర్శకాలను/ఆదేశాలను ఉల్లంఘించినందుకు, విధించడం జరిగింది.

ఈ చర్య, తప్పనిసరిగా పాటించవలసిన మార్గదర్శకాలను / ఆదేశాలను బ్యాంకు ఉల్లంఘించినందుకు మాత్రమే తప్ప, వినియోగదారుల ఏ లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటు మీద ప్రభావం కలిగి ఉండదు.

నేపథ్యం

మార్చ్ 31, 2016, ఆర్ధిక సంవత్సరానికి జరిగిన బ్యాంకు యొక్క చట్టబద్ధమైన తనిఖీలో నిరర్ధక ఆస్తుల (NPAs) గుర్తింపు ఫై ఆర్.బి.ఐ నిర్దేశించిన ఆదేశాలు/మార్గదర్శకాలు పాటించడంలో ఉల్లంఘన జరిగినట్లు వెల్లడైంది. తనిఖీ నివేదిక/దస్తావేజుల ఆధారంగా, ఆర్.బి.ఐ ఆదేశాలు/మార్గదర్శకాలు పాటించడంలో విఫలమైనదన్న ఆరోపణల ఫై, జరీమానా ఎందుకు విధించకూడదు అని బ్యాంకుకు నవంబర్ 16, 2017 న నోటీసు జారీ చేయడం జరిగింది.

బ్యాంకు ఇచ్చిన లిఖిత సమాధానం, వ్యక్తిగత విచారణలో మౌఖిక నివేదనలను పరిగణించిన అనంతరం, ఆర్.బి.ఐ ఆదేశాలు/మార్గదర్శకాలు పాటించడంలో బ్యాంకు విఫలమైనదన్న ఆరోపణలు వాస్తవమని నమ్ముతూ, జరీమానా విధించాలని నిర్ధారణకు రావడం జరిగింది.

జోస్ జె. కట్టూర్
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2017-2018/2354

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?