గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా భాభర్‌లో గల భాభర్ విభాగ్ నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై ఆర్ బి ఐ ద్రవ్య జరిమానా విధించింది. - ఆర్బిఐ - Reserve Bank of India
గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా భాభర్‌లో గల భాభర్ విభాగ్ నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై ఆర్ బి ఐ ద్రవ్య జరిమానా విధించింది.
గుజరాత్‌లోని బనస్కాంతా జిల్లా భాభర్‌లో గల భాభర్ విభాగ్ నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు( ఆర్ బి ఐ) 2023 నవంబర్ 30న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.50,000(కేవలం రూ.50 వేలు) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్నటువంటి సంస్థలు/అన్యసంస్థలకు రుణాలు, అడ్వాన్స్‌లు జారీ’ మరియు ‘డైరెక్టర్లకు రుణాలు మరియు అడ్వాన్సులు మొదలగునవి.. – డైరెక్టర్లు ష్యూరిటీ/గ్యారంటర్లుగా– స్పష్టీకరణ’ వంటి విషయాల్లో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో విఫలం కావడంతో భాభర్ విభాగ్ నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ఈ జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. నేపథ్యం 2022 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్ బి ఐ చట్టపరమైన తనిఖీ నిర్వహించింది. ఈ తనిఖీ నివేదిక, ప్రమాద అంచనా నివేదిక, ఇతర సంబంధిత నివేదికల పరిశీలనల్లో డైరెక్టర్లలో ఒకరి బంధువు, హామీదారుగా ఉన్న చోట బ్యాంకు రుణాన్ని మంజూరు చేసిందని వెల్లడైంది. దీంతో, తమ మార్గదర్శకాలను పాటించనందుకు ఎందుకు బ్యాంకుపై జరిమానా విధించకూడదో తెలుపాలంటూ.. భాభర్ విభాగ్ నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌కు రిజర్వు బ్యాంకు షోకాజు నోటీసు జారీ చేసింది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ సందర్భంగా ఇవ్వబడిన మౌఖిక సమర్పణలు పరిగణనలోకి తీసుకున్న తదుపరి, ఆర్ బి ఐ ఆదేశాల ఉల్లంఘన జరిగిందని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు భాభర్ విభాగ్ నాగరిక్ సహకారి బ్యాంకుపై ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.
(యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2023-2024/1527 |