RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Press Releases Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

108880476

పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్‌పై ఆర్‌‌ బి ఐ ద్రవ్య జరిమానా విధింపు

పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు( ఆర్ బి ఐ) 2023 సెప్టెంబర్ 19న జారీ చేసిన ఆర్డర్ ద్వారా రూ.1.10 లక్షల నగదు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన మీ వినియోగదారుణ్ని తెలుసుకోండి(KYC) మార్గదర్శకాలు, 2016’లు, ‘పరపతి సమాచార కంపెనీల(సీఐసీల) సభ్యత్వం’ విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో బ్యాంకు విఫలం కావడంతో ఈ జరిమానాను వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను, పరపతి సమాచార కంపెనీల(నియంత్రణ) చట్టం, 2005లో సెక్షన్ 23(4), సెక్షన్ 25(1)(iii) కింద ఆర్‌‌ బి ఐకి కల్పించిన అధికారాలను ఉపయోగించుకుని ఈ జరిమానాను విధించింది.

ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు.

నేపథ్యం

2022 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) చట్టపరమైన తనిఖీలు  చేపట్టింది. ఈ తనిఖీ నివేదికలో, ఇతర  సంబంధిత నివేదికల పరిశీలనల్లో (i) బ్యాంకు ప్రమాదకరమైన ఖాతాల వర్గీకరణ విషయంలో కాలానుగుణంగా సమీక్ష చేపట్టడంలో విఫలమైందని (ii) ఖాతాల ప్రమాద వర్గీకరణను చేపట్టడంలో విఫలమైందని (iii) నాలుగు సీఐసీలలో మూడింటి సభ్యత్వాన్ని పొందడంలో విఫలమైనట్లు వెలుగులోకి వచ్చింది.  దీంతో, తమ మార్గదర్శకాలను పాటించనందుకు ఎందుకు బ్యాంకుపై జరిమానా విధించకూడదో తెలుపాలంటూ.. బిర్భూమ్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు రిజర్వు బ్యాంకు షోకాజు నోటీసు జారీ చేసింది.

షోకాజు నోటీసుకు బ్యాంకు ఇచ్చిన ప్రత్యుత్తరం, వ్యక్తిగత విచారణ సమయంలో బ్యాంకు మౌఖికంగా తెలిపిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకున్న ఆర్‌‌ బి ఐ.. ఆదేశాల ఉల్లంఘన జరిగిందని, పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు బిర్భూమ్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుపై ద్రవ్య జరిమానా విధించదగినదేనని నిర్ధారణకు వచ్చింది.

యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన : 2023‌‌ - 2024/1201

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?