<font face="mangal" size="3px">కల్నల్ R.D. నికమ్ సైనిక్ సహకరి బ్యాంక్ లిమిటెడ్ - ఆర్బిఐ - Reserve Bank of India
కల్నల్ R.D. నికమ్ సైనిక్ సహకరి బ్యాంక్ లిమిటెడ్, సతారా పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు
జనవరి 02, 2023 కల్నల్ R.D. నికమ్ సైనిక్ సహకరి బ్యాంక్ లిమిటెడ్, సతారా పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) డిసెంబర్ 28, 2022 నాటి తమ ఉత్తర్వు ద్వారా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (చట్టం) లోని సెక్షన్ 26 A తో కలిపి సెక్షన్ 56 క్రింద మరియు డిపాజిటర్ ఎడ్యుకేషన్ మరియు అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్, 2014 విషయాలపై RBI జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందులకు, కల్నల్ R.D. నికమ్ సైనిక్ సహకరి బ్యాంక్ లిమిటెడ్, సతారా (‘బ్యాంక్’) పై ₹1.00 లక్ష (ఒక లక్ష రూపాయిలు మాత్రమే) జరిమానా విధించింది. RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (చట్టం) లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఈ జరిమానా విధించబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు. నేపథ్యo మార్చి 31, 2021 తేదీనాటి బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించి RBI నిర్వహించిన చట్టబద్ధమైన తనిఖీ నివేదిక ద్వారా, మిగతా వాటితోపాటు, పదేళ్లకు పైగా క్లెయిమ్ చేయని నిర్దిష్ట ఖాతాలలోని నిల్వలను బ్యాంక్, ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ మరియు అవేర్‌నెస్ ఫండ్’ కు బదిలీ చేయలేదని వెల్లడైంది. దీని ఆధారంగా, ‘చట్టం’ లో పేర్కొన్న నిబంధనలను మరియు ‘చట్టం’ క్రింద ఇవ్వబడిన ఆదేశాలను ఉల్లంఘించినందులకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది. ఇవ్వబడిన నోటిసు కు బ్యాంక్ సమర్పించిన ప్రత్యుత్తరం ను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, ఈ విషయంలో బ్యాంక్ ద్వారా RBI ఆదేశాల ఉల్లంఘన వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2022-2023/1483 |