డా. అంబేద్కర్ నాగరిక్ సహకారి బ్యాంక్ మర్యాదిత్, గ్వాలియర్, మధ్యప్రదేశ్ పై ఆర్బీఐ నగదు జరిమానా విధింపు
అక్టోబర్ 31, 2018 డా. అంబేద్కర్ నాగరిక్ సహకారి బ్యాంక్ మర్యాదిత్, గ్వాలియర్, మధ్యప్రదేశ్ పై ఆర్బీఐ నగదు జరిమానా విధింపు. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 47A(1) (c) రెడ్ విత్ సెక్షన్ 46 (4) (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల ప్రకారం, భారతీయ రిజర్వు బ్యాంకు తమకు దఖలుపరచబడిన అధికారములతో డా. అంబేద్కర్ నాగరిక్ సహకారి బ్యాంక్ మర్యాదిత్ , గ్వాలియర్, మధ్యప్రదేశ్ పై, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 27 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనలను మరియు ‘పర్యవేక్షణా చర్యల చట్రం’ క్రింద విధించిన ఆంక్షలను ఉల్లంఘించినందులకు ₹ 50,000/- (యాభైవేల రూపాయలు) నగదు జరిమానా విధించింది. 2. భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు, బ్యాంక్ లిఖిత పూర్వక సమాధానం దాఖలు చేసింది. ఈ సందర్భంగా నిజానిజాలు, బ్యాంక్ ఇచ్చిన సమాధానం మరియు మౌఖిక వినతిని పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినవై, అవి నగదు జరిమానా విధించదగినవేనని, బారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చినది అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/1008 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: