RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

129507464

తేదీ: 19/09/2023 మహా రాష్ట్ర లోని నాసిక్ కు చెందిన " డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ సహకారీ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.

'డైరెక్టర్ లు , బంధువులు మరియు సంస్థలు మొదలైన వానిలో వారు ఇష్టపడిన వారికి అప్పులు, అడ్వాన్స్ లు మరియు దానికి అనుబంధమైన " డైరెక్టర్ లు మొదలైన వారికి అప్పులు, అడ్వాన్స్ లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రం లోని పటాన్ కు చెందిన " పటాన్ నాగరిక్ సహకారీ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 03-11-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 50,000/- (ఒక యాభైవేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (1) (C), 46 (4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ అపరాధ రుసుమును విధించింది.

నేపధ్యం

బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిగతులపై 31-03-2023 తేదీన భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టబద్ధమైన విచారణ జరిపింది. విచారణ నివేదిక, బాధక అంచనా నివేదిక మరియు దీనికి సంబంధించిన అన్నీ ఇతర అంశాలను కూలంకషంగా పరిశీలించి.

తదనుగుణంగా నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్యాంకు పై ఎందుకు చర్య తీసుకోకూడదో వివరించాలంటూ బ్యాంకుకు ఒక నోటిస్ ను జారీ చేసింది. నోటీసుకు బ్యాంకువారు పంపిన ప్రత్యుత్తరము, వ్యక్తిగత సమర్పణల ఆధారంగా బ్యాంకు భారతీయ రిజర్వ్ బ్యాంకు రూపొందించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు నిర్ధారించి బ్యాంకుపై అపరాధ రుసుము విధించింది.

నియమ నిబంధనలను సరిగా పాటించని కారణంగా చర్య తీసుకోబడింది. అంతే కానీ బ్యాంకు యొక్క ఖాతాదారులు జరుపుతున్న లావాదేవీలు, ఒప్పందాలపై చర్య ఎటువంటి ప్రభావము చూపదు. అపరాధ రుసుము విధించినప్పటికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ సదరు బ్యాంక్ పైన మరేదైనా చర్య తీసుకొనే అధికారం కలిగి వుంటుంది.

(పునీత్ పాoచోలి)     
ముఖ్య నిర్వహణ అధికారి

పత్రికా విడుదల: 2024-2025/1131

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?