<font face="mangal" size="3">డా. పంజాబ్‌రావ్ దేశ్‌ముఖ్ అర్బన్‌ కో-ఆపరేటివ - ఆర్బిఐ - Reserve Bank of India
డా. పంజాబ్రావ్ దేశ్ముఖ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., అమ్రావతి (మహారాష్ట్ర)
పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధింపు
ఏప్రిల్ 26, 2017 డా. పంజాబ్రావ్ దేశ్ముఖ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., అమ్రావతి (మహారాష్ట్ర) భారతీయ రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 47 (A)(1)(b) మరియు సెక్షన్ 46(4) క్రింద తమకు దఖలుపరచబడిన అధికారాలతో, డా. పంజాబ్రావ్ దేశ్ముఖ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., అమ్రావతి పై, మీ వినియోగదారుణ్ణి తెలిసికోండి (KYC) నిబంధనలు ఉల్లంఘించినందుకు, ₹ 5.0 లక్షలు (ఐదు లక్షల రూపాయిలు) నగదు జరిమానా విధించినది. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన షో కాజ్ నోటీసుకు, బ్యాంక్ లిఖిత పూర్వకంగా జవాబు ఇచ్చినది. ఈ విషయంలో నిజానిజాలు మరియు బ్యాంక్ సమర్పించిన జవాబు పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగినవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చింది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2016-2017/2912 |