మహారాష్ట్ర, పుణేలోని ఎర్లీ సాలరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆర్ బి ఐ ద్రవ్య జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
మహారాష్ట్ర, పుణేలోని ఎర్లీ సాలరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆర్ బి ఐ ద్రవ్య జరిమానా విధింపు
మహారాష్ట్ర పుణేలోని ఎర్లీ సాలరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 సెప్టెంబర్ 15 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.3.20 లక్షల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీలకు చెందిన ‘ నాన్–సిస్టెమికల్లీ ఇంపార్టెంట్ నాన్–డిపాజిట్ టేకింగ్ కంపెనీ(రిజర్వు బ్యాంకు) ఆదేశాలు, 2016’ పాటించడంలో కంపెనీ విఫలైందని ఆర్ బి ఐ గుర్తించింది. భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934లోని సెక్షన్ 58B(5)(aa) మరియు సెక్షన్ 58G(1)(b)ల కింద ఆర్ బి ఐకి కల్పించిన అధికారాలను ఉపయోగించుకుని ఈ జరిమానాను విధించింది. ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, కంపెనీ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. నేపథ్యం: 2021 అక్టోబర్ నెలలో జరిపిన పర్యవేక్షణ సందర్శన/పరిశీలనలో ఆర్ బి ఐకి, కంపెనీకి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో, అవుట్ సోర్సింగ్ కార్యకలాపాల కోసం అంతర్గతంగా ఆడిట్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో కంపెనీ విఫలమైందని ఆర్ బి ఐ గుర్తించింది. దీంతో, తమ మార్గదర్శకాలను పాటించనందుకు కంపెనీపై ఎందుకు జరిమానా విధించకూడదో తెలుపాలంటూ షోకాజు నోటీసు జారీ చేసింది. షోకాజు నోటీసుకు కంపెనీ పంపిన ప్రత్యుత్తరాన్ని, వ్యక్తిగత విచారణ సమయంలో కంపెనీ ఇచ్చిన మౌఖిక సమాధానాన్ని, కంపెనీ పంపిన అదనపు సమాచారాన్ని పరిశీలించిన తర్వాత, మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో కంపెనీ విఫలైందని వెల్లడైంది. మార్గదర్శకాల ఉల్లంఘన చర్యల కింద ఎర్లీ సాలరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై నగదు జరిమానా విధించాలని ఆర్ బి ఐ నిర్ధారించింది.
(యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2023-2024/1251 |