<font face="mangal" size="3">గోండియా డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ - ఆర్బిఐ - Reserve Bank of India
గోండియా డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, గోండియా (మహారాష్ట్ర) పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్రవ్య జరిమానా విధింపు
జనవరి 09, 2023 గోండియా డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, గోండియా భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) జనవరి 05, 2023 నాటి తమ ఉత్తర్వు ద్వారా “బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (చట్టం)” నిబంధనలు, “ది డిపాజిటర్ ఎడ్యుకేషన్ మరియు అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్, 2014 (ది స్కీమ్)” నిబంధనలు, మరియు “ఫ్రాడ్స్ – వర్గీకరణ, రిపోర్టింగ్ & మానిటరింగ్ మార్గదర్శకాలు” పై నాబార్డ్ జారీ చేసిన ఆదేశాలను పాటించనందులకు / ఉల్లంఘించినందులకు, గోండియా డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, గోండియా (మహారాష్ట్ర) (‘బ్యాంక్’) పై ₹2.00 లక్షల (అక్షరాలా రెండు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. RBI జారీ చేసిన పై ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని RBI ద్వారా ఈ జరిమానా విధింపబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు. నేపథ్యo బ్యాంక్ యొక్క మార్చి 31, 2020 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా చేపట్టిన తనిఖీ నివేదిక ద్వారా, మిగతావాటితో కలిపి, బ్యాంక్ (i) అర్హతగల క్లెయిమ్ చేయబడని డిపాజిట్‌లను డిపాజిటర్ ఎడ్యుకేషన్ మరియు అవేర్‌నెస్ ఫండ్‌కి నిర్దేశించిన కాలపరిమితిలోగా బదిలీ చేయలేదని మరియు (ii) ‘చట్టం’ లోని నిబంధనలు మరియు నాబార్డ్ జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలకు విరుద్ధంగా ఫ్రాడ్స్ సంబంధిత సమాచారం ను నాబార్డ్ కు నివేదించక పోవడం/ ఆలస్యంగా నివేదించడంద్వారా, జారీ చేయబడిన పై ఆదేశాలను పాటించలేదని/ ఉల్లంఘించినదని వెల్లడి చేయబడింది. దీని ఆధారంగా, పైన ఉటంకించిన ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది. నోటీసు కు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరములు, మరియు ఇవ్వబడిన సమర్పణలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, బ్యాంక్ ద్వారా ‘చట్టం’ నిబంధనలు మరియు నాబార్డ్ ఆదేశాల ఉల్లంఘన జరిగిందని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2022-2023/1517 |