హనమసాగర్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, హనమసాగర్, కర్ణాటక వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
హనమసాగర్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, హనమసాగర్, కర్ణాటక వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు
“UCBs లో మోసాలు: పర్యవేక్షణ మరియు నివేదన యంత్రాగం లో మార్పులు” తో పాటుగా “మోసాలు-వర్గీకరణ మరియు రిపోర్టింగ్‌పై మాస్టర్ సర్క్యులర్” మరియు XBRL-FMR సమర్పణపై మోసాలను నివేదించడం, FMR 2 నిలిపివేత మరియు FMR-3 పరిచయం” వంటి అంశాలపై RBI జారీచేసిన నిబంధనలను ఉల్లంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా ఫిబ్రవరి 14, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా హనమసాగర్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, హనమసాగర్, కర్ణాటక, (బ్యాంక్) వారి పై ₹50 వేలు (యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది. ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు. నేపథ్యం: మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఈ తనిఖీలో భాగంగా రిస్క్ అంచనా నివేదిక మరియు దానికి సంబంధించిన అన్ని ప్రత్యుత్తరాల సమగ్ర పరిశీలన ద్వారా - జరిగిన ఒక మోసపూరిత (ఫ్రాడ్) కేసును బ్యాంకు వారు నిర్ణీత కాల పరిమితిలోగా RBI దృష్టికి తీసుకురాలేదన్న విషయం వెల్లడైనది. అందువల్ల ఆర్బిఐ రూపొందించిన, పైన పేర్కొన్న నిర్దేశాలను అనుసరించుటలో వైఫల్యం కారణంగా బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, పైన పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను బ్యాంకుపై ఆర్బిఐ విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది. యోగేష్ దయాల్ చీఫ్ జనరల్ మేనేజర్ పత్రికా ప్రకటన: 2023-2024/1920 |