RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78525489

ఇల్కల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. ఇల్కల్, కర్ణాటక పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు

జనవరి 30, 2023

ఇల్కల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. ఇల్కల్, కర్ణాటక పై
భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు

ఇల్కల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. ఇల్కల్, కర్ణాటక (‘బ్యాంక్’) పై, “ఆదాయ గుర్తింపు మరియు ఆస్తుల వర్గీకరణ, కేటాయింపులు (ప్రొవిజనింగ్) మరియు ఇతర సంబంధిత విషయాలు - పట్టణ సహకార బ్యాంకులు (UCBలు)” సంబంధిత విషయాలపై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) జారీ చేసిన ఆదేశాలను పాటించనందులకు/ఉల్లంఘించినందులకు, RBI జనవరి 23, 2023 నాటి ఉత్తర్వు ద్వారా, 1.00 లక్ష (ఒక లక్ష రూపాయలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధించింది. RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార బ్యాంకులకు వర్తించే మేర) లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని RBI ద్వారా ఈ జరిమానా విధించబడింది.

ఈ చర్య నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు.

నేపధ్యము

బ్యాంక్ యొక్క మార్చి 31, 2021 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా చేపట్టిన తనిఖీ నివేదిక, మిగతావాటితో కలిపి, బ్యాంక్ నిర్దిష్ట నిరర్ధక ఖాతాలను ప్రామాణిక(స్టాండర్డ్) ఆస్తులుగా తప్పుగా వర్గీకరించినట్లు వెల్లడించింది. దీని ఆధారంగా, ఆదేశాలను పాటించనందుకు అపరాధ రుసుము ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది.

బ్యాంక్ యొక్క ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖిక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, ఈ విషయంలో బ్యాంక్ ద్వారా RBI జారీ చేసిన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు అపరాధ రుసుము విధించదగినదిగా, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.

(యోగేష్ దయాల్)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2022-2023/1634

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?