RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78512296

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధింపు

మార్చ్ 05, 2018

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధింపు

భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జారీచేయబడిన ‘మీ వినియోగదారుని గురించి తెలుసుకోండి’ (KYC) మార్గదర్శకాలను/ఆదేశాలను ఉల్లంఘించినందుకు, భారతీయ రిజర్వు బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఫై ఫిబ్రవరి 27, 2018 న 20 మిలియన్ జరిమానా విధించింది. ఈ జరీమానా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 47A(1)(c) తో కలిపి, సెక్షన్ 46(4)(1) లోని అధికారాలను వినియోగించుకొని, పైన ఉదహరించిన మార్గదర్శకాలను/ఆదేశాలను ఉల్లంఘించినందుకు, విధించడం జరిగింది.

ఈ చర్య, తప్పనిసరిగా పాటించవలసిన మార్గదర్శకాలను/ఆదేశాలను బ్యాంకు ఉల్లంఘించినందుకు మాత్రమే తప్ప, వినియోగదారుల ఏ లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటు మీద ప్రభావం కలిగి ఉండదు.

నేపథ్యం

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు యొక్క ఒక శాఖలో మోసం జరిగినట్లు గుర్తించడమైనది. మోసానికి సంబంధించి ఆ శాఖ దస్తావేజులు /అంతర్గత తనిఖీ నివేదిక మొదలైనవాటిని పరీశీలించిన తరువాత భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జారీచేయబడిన ‘మీ వినియోగదారుని గురించి తెలుసుకోండి’ (KYC) మార్గదర్శకాలను/ఆదేశాలను పాటించడంలో బ్యాంకు విఫలమైనదని నిర్ధారించబడింది. దస్తావేజుల ఆధారంగా, ఆర్.బి.ఐ ఆదేశాలు/మార్గదర్శకాలు పాటించడంలో విఫలమైనదన్న ఆరోపణల ఫై, జరీమానా ఎందుకు విధించకూడదు అని బ్యాంకుకు నోటీసు జారీ చేయడం జరిగింది.

బ్యాంకు ఇచ్చిన లిఖిత సమాధానం, వ్యక్తిగత విచారణలో మౌఖిక నివేదనలను పరిగణించిన అనంతరం, ఆర్.బి.ఐ ఆదేశాలు/మార్గదర్శకాలు పాటించడంలో బ్యాంకు విఫలమైనదన్న ఆరోపణలు వాస్తవమని నమ్ముతూ, జరీమానా విధించాలని నిర్ధారణకు రావడం జరిగింది.

జోస్ జె. కట్టూర్
చీఫ్ జనరల్ మేనేజర్ర్

పత్రికా ప్రకటన: 2017-2018/2355

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?