RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Press Releases Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

108879389

ఇంద్రాయనీ సహకార బ్యాంక్ లిమిటెడ్, పింప్రి, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

ఆదాయ గుర్తింపు, ఆస్తి వర్గీకరణ, ప్రొవిజనింగ్ మరియు ఇతర సంబంధిత విషయాలు-UCBs’ మరియు ‘భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మీ ఖాతాదారును తెలుసుకోండి (KYC)’ మార్గనిర్ధేశాలు, 2016’ కి సంబంధించి ఆర్బీఐ రూపొందించిన నిర్దిష్ట నిబంధనలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(c) తో పాటు 46 (4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా సెప్టెంబర్ 25, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా ఇంద్రాయనీ సహకార బ్యాంక్ లిమిటెడ్, పింప్రి, మహారాష్ట్ర (బ్యాంక్) వారి పై 3 లక్షలు (మూడు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు.

నేపథ్యం:

మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది.  ఈ తనిఖీలో భాగంగా రిస్క్ అంచనా నివేదిక మరియు దానికి సంబంధించిన అన్ని ప్రత్యుత్తరాల సమగ్ర పరిశీలన ద్వారా వెల్లడైన అంశాలు (i) ఇంటర్-బ్యాంక్ స్థూల ఎక్స్పోజర్ పరిమితి మరియు ఇంటర్-బ్యాంక్ కౌంటర్ పార్టీ ఎక్స్పోజర్ పరిమితి ఉల్లంఘన, (ii) ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ మరియు ప్రొవిజనింగ్‌కు సంబంధించిన ప్రుడెన్షియల్ నిబంధనలకు కట్టుబడకుండుట, కస్టమర్ల KYC యొక్క కాలానుగుణ నవీకరణ కోసం ఒక సరైన వ్యవస్థను అమలు చేయకపోవడం.

ఆర్బిఐ రూపొందించిన నిర్దేశాలను అనుసరించుటలో వైఫల్యం కారణంగా బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది.

భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, లోగడ పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను ఆర్బిఐ విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది.

(యోగీష్ దయాళ్)    
ముఖ్య నిర్వహణ అధికారి

పత్రికా విడుదల: 2023-2024/1167

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?