RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

129508377

మహారాష్ట్ర లోని పూణే నగరానికి చెందిన "జై భవానీ సహకార బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.

"భారతీయ రిజర్వ్ బ్యాంకు - మీ ఖాతాదారుని గుర్తించు (కె వై సీ) నిర్ధేశకాలు, 2016" మరియు " ధరావతు ఖాతాల నిర్వహణ- ప్రాధమిక(పట్టణ)సహకార బ్యాంకుల" కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల మహారాష్ట్ర లోని పూణే నగరానికి చెందిన " జై భవానీ సహకార బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 25-09-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 1,50,000 (ఒక లక్షయాభైవేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (1)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

ఈ బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిగతులపై 31-03-2022 తేదీన భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టబద్ధమైన విచారణ జరిపింది. విచారణ నివేదిక, బాధక అంచనా నివేదిక మరియు దీనికి సంబంధించిన అన్నీ ఇతర అంశాలను కూలంకషంగా పరిశీలించి క్రింది అంశాలలో పొరపాట్లు జరిగినట్లు నిర్ధారించింది.

(i) అన్ క్లైమ్ ధరావత్తు మొత్తాలను నిర్ణీతకాల వ్యవధిలో ఖాతాదారుని విద్య మరియు ఆవగాహన నిధికి జమచేయకపోవడం.

(ii)      ఖాతాల విభాగీకరణ లోని బాధకానికి సంబంధించి క్రమానుగత సమీక్షలు నిర్వహించకపోవడం.

(iii)    వాడుకలో  లేని ఖాతాలకు సంబంధించి వార్షిక సమీక్షను తీసుకోవడంలో విఫలం కావడం.

తదనుగుణంగా నిబంధనలు ఉల్లఘించినందుకు  బ్యాంకు పై ఎందుకు చర్య తీసుకోకూడదో వివరించాలంటూ బ్యాంకుకు ఒక నోటీసును జారీ చేసింది.

ఈ నోటీసుకు బ్యాంకు వారు పంపిన ప్రత్యుత్తరము, దాఖలు పరచిన అదనపు సమాచారము మరియు మౌఖిక సంప్రదింపుల ఆధారంగా ఈ బ్యాంకు భారతీయ రిజర్వ్ బ్యాంకు రూపొందించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు నిర్ధారించి బ్యాంకుపై అపరాధ రుసుమును విధించింది.

నియమ నిబంధనలను సరిగా పాటించని కారణంగా ఈ చర్య తీసుకోబడింది. అంతే కానీ బ్యాంకు యొక్క ఖాతాదారులు జరుపుతున్న లావాదేవీలు, ఒప్పందాలపై ఈ చర్య ఎటువంటి ప్రభావము చూపదు. అపరాధ రుసుము విధించినప్పటికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ సదరు బ్యాంక్ పైన మరేదైనా చర్య తీసుకొనే అధికారం కలిగి వుంటుంది

 

(పునీత్ పాoచోలి)     
ముఖ్య నిర్వహణ అధికారి

పత్రికా విడుదల: 2024-2025/1192

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?