జనత సహకారి బ్యాంక్ లిమిటెడ్, అమరవతి, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
జనత సహకారి బ్యాంక్ లిమిటెడ్, అమరవతి, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 26A తో పాటు 56 లో పొందుపరిచిన నిబంధనలు ఉల్లంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జనవరి 19, 2024 తేదీన జారీ చేసిన ఉత్తర్వు ద్వారా జనత సహకారి బ్యాంక్ లిమిటెడ్, అమరవతి, (బ్యాంక్) వారి పై ₹50,000/-(యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది. ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన మరే ఇతర లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు. నేపథ్యం: మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఈ చర్యలో భాగంగా తనిఖీ నివేదిక, రిస్క్ అంచనా నివేదిక మరియు దానికి సంబంధించిన అన్ని ప్రత్యుత్తరాల సమగ్ర పరిశీలన ద్వారా బ్యాంకు డిపాజిటర్ శిక్షణ మరియు అవగాహన నిధికి యోగ్యమైన మొత్తాలను నిర్దిష్ట గడువు లోగా బదిలీ చేయలేదని వెల్లడైనది, కావున ఆర్బిఐ రూపొందించిన విదివిధానాలను అనుసరించుటలో వైఫల్యం కారణంగా బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, పైన పేర్కొన్న బ్యాంకింగ్ నియంత్రణ చట్టం నిర్దిష్ట నిబంధనల ఉల్లంఘనలకు గాను ఆర్బిఐ విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది.
యోగేష్ దయాల్ చీఫ్ జనరల్ మేనేజర్ పత్రికా ప్రకటన: 2023-2024/1781 |