RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

128940328

మహారాష్ట్రలోని నాసిక్‌లో గల జన్‌సేవ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై ఆర్‌‌.బి.ఐ ద్రవ్య జరిమానా విధింపు

మహారాష్ట్రలోని నాసిక్‌లో గల జన్‌సేవ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) 2024 ఫిబ్రవరి 13 నాడు జారీ చేసిన ఆర్డర్ ద్వారా రూ.50 వేల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్నటు వంటి సంస్థలు/అన్యసంస్థలకు రుణాలు, అడ్వాన్సులు జారీ’’, ‘‘డైరెక్టర్లకు రుణాలు మరియు అడ్వాన్సులు మొదలగునవి – డైరెక్టర్లు ష్యూరిటీ/గ్యారంటర్లుగా స్పష్టీకరణ” వంటి విషయాల్లో ఆర్.బి.ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు జన్‌సేవ సహకార బ్యాంకు లిమిటెడ్ కట్టుబడి ఉండకపోవడంతో ఆర్.బి.ఐ ఈ ద్రవ్య జరిమానాను విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్‌‌.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధింపబడింది.

ఈ చర్య నియంత్రణా ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు.

నేపథ్యం

2022 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్‌‌.బి.ఐ ఆ బ్యాంకుపై చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. తనిఖీ నివేదిక, ప్రమాద అంచనా నివేదిక, ఇతర సంబంధిత నివేదికల పరిశీలనల్లో (1) డైరెక్టర్ సంబంధిత రుణాన్ని జారీ చేసిందని, (2) హామీదారుగా ఉన్న బ్యాంకు డైరెక్టర్ బంధువుకు బ్యాంకు రుణం మంజూరు చేసిందని వెల్లడైంది. దీంతో, తాము జారీ చేసిన మార్గదర్శకాలను పాటించనందుకు ఎందుకు ద్రవ్య జరిమానా విధించకూడదో తెలుపాలంటూ జన్‌సేవ సహకార బ్యాంకుకు ఆర్.బి.ఐ షోకాజు నోటీసు జారీ చేసింది.

నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ సందర్భంగా ఇవ్వబడిన మౌఖిక సమర్పణలు పరిగణనలోకి తీసుకున్న తదుపరి, బ్యాంక్ ద్వారా ఆర్.బి.ఐ ఆదేశాల ఉల్లంఘన జరిగిందని, పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.

 

(శ్వేతాశర్మ)

డిప్యూటీజనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన :2023‌‌-2024/1918                                                                   

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?