RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

108881223

మహారాష్ట్ర లోని పూణే నగరానికి చెందిన "జిజా మాతా మహిళా సహకార బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.

"భారతీయ రిజర్వ్ బ్యాంకు - మీ ఖాతాదారుని గుర్తించు (కె వై సీ) నిర్ధేశకాలు, 2016" మరియు " పట్టణ సహకార బ్యాంకు మోసాలు : నియంత్రణ మరియు నివేదన యంత్రాగంలోని మార్పులు" కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల మహారాష్ట్ర లోని పూణే నగరానికి చెందిన "జిజా మాతా మహిళా సహకార బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 20-11-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 4,00,000 (నాలుగు లక్షల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (1)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

నియంత్రణ సమ్మతిలో జరిగిన లోపాల ఆధారంగా ఈ చర్య తీసుకోబడింది. అంతే కానీ బ్యాంకు యొక్క ఖాతాదారులు జరుపుతున్న లావాదేవీలు, ఒప్పందాలపై ఈ చర్య ఎటువంటి ప్రభావము చూపదు.

నేపధ్యం

ఈ బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిగతులపై 31-03-2022 తేదీన భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టబద్ధమైన విచారణ జరిపింది. విచారణ నివేదిక, బాధక అంచనా నివేదిక మరియు దీనికి సంబంధించిన అన్నీ ఇతర అంశాలను కూలంకషంగా పరిశీలించి క్రింది అంశాలలో పొరపాట్లు జరిగినట్లు నిర్ధారించింది. (i) ఖాతాల విభాగీకరణ లోని బాధకానికి సంబంధించి క్రమానుగత సమీక్షలు నిర్వహించకపోవడం. (ii) మోసాన్ని గురించి నిర్ధేశిత కాలవ్యవధిలో భారతీయ రిజర్వ్ బ్యాంకుకు నివేదించకపోవడం. తదనుగుణంగా నిబంధనలు ఉల్లఘించినందుకు బ్యాంకు పై ఎందుకు చర్య తీసుకోకూడదో వివరించాలంటూ బ్యాంకుకు ఒక నోటీసును జారీ చేసింది.

ఈ నోటీసుకు బ్యాంకు వారు పంపిన ప్రత్యుత్తరము, దాఖలు పరచిన అదనపు సమాచారము మరియు మౌఖిక సంప్రదింపుల ఆధారంగా ఈ బ్యాంకు భారతీయ రిజర్వ్ బ్యాంకు రూపొందించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు నిర్ధారించి బ్యాంకుపై అపరాధ రుసుమును విధించింది.

 

(యోగీష్ దయాళ్)    
ముఖ్య నిర్వహణ అధికారి

పత్రికా విడుదల: 2023-2024/1409

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?