RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

103375479

జిజౌ కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అమరావతి, మహారాష్ట్ర పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు

తేది: 12/12/2022

జిజౌ కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అమరావతి, మహారాష్ట్ర పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు

జిజౌ కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అమరావతి, మహారాష్ట్ర, “మీ వినియోగదారుని తెలుసుకోండి (KYC)” మరియు ప్రాంగణంలో ATM స్థాపించడం నిబంధనలపై UCBలకు భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) జారీ చేసిన ఆదేశాలను పాటించనందుకు/ఉల్లంఘించినందుకు, RBI తన డిసెంబర్ 05, 2022 నాటి ఉత్తర్వు ద్వారా బ్యాంకుపై రూ.1.25 లక్షల (రూ. ఒక లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే విధంగా) లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, ఈ జరిమానా విధించబడింది.

ఈ చర్య నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా భావించరాదు.

నేపధ్యము

బ్యాంక్ యొక్క మార్చి 31, 2021 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా చేపట్టిన తనిఖీ నివేదిక మిగతావాటితో కలిపి, (i) “మీ వినియోగదారుని తెలుసుకోండి (KYC)” మరియు (ii) ప్రాంగణంలో ATM స్థాపించడం నిబంధనలపై, RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను ఉల్లంఘించిందని/పాటించలేదని వెల్లడించింది. దీని ఆధారంగా, ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది.

బ్యాంక్ యొక్క ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత, ఈ విషయంలో బ్యాంకు ద్వారా RBI ఆదేశాల ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.

(యోగేష్ దయాల్)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2022-2023/1347

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?