<font face="mangal" size="3px">ఖార్‌‌గోనే నాగ్రిక్ సహకారి బ్యాంక్ మర్యాది - ఆర్బిఐ - Reserve Bank of India
ఖార్గోనే నాగ్రిక్ సహకారి బ్యాంక్ మర్యాదిత్, ఖార్గోనే పై నగదు జరిమానా విధించిన ఆర్ బి ఐ
ఆగస్ట్ 24, 2015 ఖార్గోనే నాగ్రిక్ సహకారి బ్యాంక్ మర్యాదిత్, ఖార్గోనే పై బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, (కో ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సెక్షన్ 47A (1)(b) మరియు 46(4) ద్వారా తమకు లభించిన అధికారాలతో రిజర్వ్ బ్యాంక్, ఖార్గోనే నాగ్రిక్ సహకారి బ్యాంక్ మర్యాదిత్, ఖార్గొనే, పై రూ.1 లక్ష నగదు జరిమానా విధించింది. ఈ జరిమానా, మీ వినియోగదారుని తెలుసుకోండి (KYC), మరియు ఏంటీ మనీ లాండరింగ్ (AML) కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ నిర్దేశాలను, మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు, సకాలం లో సరియైన 'అమలు నివేదికలు' దాఖలు చేయనందుకు, విరాళాలు మంజూరు చేసినందుకు, విధించడమైనది. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన సంజాయిషీ నోటీసుకు, ఆ బ్యాంక్ లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చింది. బ్యాంక్ ఇచ్చిన జవాబునీ, వాస్తవాలని పరిశీలించిన తరువాత, ఉల్లంఘనలు నిరూపించబడ్డాయని, అవి నగదు జరిమానా విధించవలసినంత తీవ్రమైనవేనని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. సంగీతా దాస్ |