<font face="mangal" size="3">కోల్‌కతా పోలీస్ సహకార బ్యాంక్ లిమిటెడ్, కోల్ - ఆర్బిఐ - Reserve Bank of India
కోల్కతా పోలీస్ సహకార బ్యాంక్ లిమిటెడ్, కోల్కతా, పశ్చిమ బెంగాల్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు
తేది: 27/03/2023 కోల్కతా పోలీస్ సహకార బ్యాంక్ లిమిటెడ్, కోల్కతా, పశ్చిమ బెంగాల్ పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) మార్చ్ 24, 2023 నాటి ఆదేశం ద్వారా, కోల్కతా పోలీస్ సహకార బ్యాంక్ లిమిటెడ్, కోల్కతా, పశ్చిమ బెంగాల్ (ది బ్యాంకు) పై ₹1.10 లక్ష (రూ. ఒక లక్ష పది వేలు మాత్రమే) జరిమానా విధించింది. ఆర్బిఐ జారీ చేసిన ‘మీ వినియోగదారుని తెలుసుకోండి (KYC) ఆదేశాలు, 2016' ల ఉల్లంఘనకు ఫై జరీమానా విధించడం జరిగింది. ఆర్బిఐ జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఈ జరిమానా విధించబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా ఉద్దేశించబడలేదు. నేపధ్యము మార్చి 31, 2022 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా బ్యాంక్ యొక్క తనిఖీ నివేదిక, మిగతా వాటితో సహా, ఖాతాల నష్ట భయ వర్గీకరణ మరియు విశిష్ట వినియోగదారుల గుర్తింపు కోడ్ (UCIC) కేటాయింపుపై కాలానుగుణ సమీక్షలో ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ విఫలమైందని వెల్లడించింది. దీని ఆధారంగా, ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది. బ్యాంక్ యొక్క ప్రత్యుత్తరం, సంబంధిత అదనపు సమర్పణలు మరియు వ్యక్తిగత విచారణ సమయంలో సమర్పించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఈ విషయంలో బ్యాంకు ద్వారా ఆర్బిఐ ఆదేశాల ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాల్) పత్రికా ప్రకటన: 2022-2023/1922 |