<font face="mangal" size="3px">కృష్ణా కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, భోపాల్, & - ఆర్బిఐ - Reserve Bank of India
కృష్ణా కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, భోపాల్, పై నగదు జరిమానా విధించిన ఆర్ బి ఐ
ఆగస్ట్ 24, 2015 కృష్ణా కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, భోపాల్, పై నగదు జరిమానా విధించిన ఆర్ బి ఐ బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, (కో ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సెక్షన్ 47A (1)(b) మరియు 46(4) ద్వారా తమకు లభించిన అధికారాలతో రిజర్వ్ బ్యాంక్, కృష్ణా కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, భోపాల్, పై రూ. 5 లక్షల నగదు జరిమానా విధించింది. ఈ జరిమానా, మీ వినియోగదారుని తెలుసుకోండి (KYC), మరియు ఏంటీ మనీ లాండరింగ్ (AML) కు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశాలను, మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు, విధించబడింది. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన సంజాయిషీ నోటీసుకు, ఆ బ్యాంక్ లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చింది. బ్యాంక్ ఇచ్చిన జవాబునీ, వాస్తవాలనీ పరిశీలించిన తరువాత, ఉల్లంఘనలు నిరూపించబడ్డాయని, అవి నగదు జరిమానా విధించవలసినంత తీవ్రమైనవేనని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. సంగీతా దాస్ పత్రికా ప్రకటన : 2015-2016/476 |