<font face="mangal" size="3">సతారాలోని కృష్ణ సహకరి బ్యాంక్ లిమిటెడ్‌ పై భ - ఆర్బిఐ - Reserve Bank of India
సతారాలోని కృష్ణ సహకరి బ్యాంక్ లిమిటెడ్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు
మే 22, 2023 సతారాలోని కృష్ణ సహకరి బ్యాంక్ లిమిటెడ్ పై భారతీయ రిజర్వు భారతీయ రిజర్వు బ్యాంకు, మే 19, 2023 నాటి ఆర్డర్ ద్వారా డిపాజిట్ ఖాతాల నిర్వహణకు సంబంధించి ఆర్బిఐ (RBI) జారీ చేసిన ఆదేశాలను పాటించనందులకు ది కృష్ణ సహకరి బ్యాంక్ లిమిటెడ్, సతారా (బ్యాంక్) పై ₹1.00 లక్ష (ఒక లక్ష రూపాయలు మాత్రమే) జరిమానాను విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, ఆర్బిఐ (RBI) చే జారీచేయబడ్డ పై ఉటంకించబడిన ఆదేశాలను బ్యాంక్ పాటించనందులకు, ఆర్బిఐ (RBI) ద్వారా ఈ జరిమానా విధించబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు. నేపథ్యo మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జరిపిన చట్టబద్ధమైన తనిఖీ మరియు రిస్క్ అసెస్మెంట్ రిపోర్ట్ మరియు దానికి సంబంధించిన అన్ని ఉత్తర ప్రత్యుత్తరము(కరస్పాండెన్స్)ల పరిశీలనలో, మిగతావాటితోపాటు, ఆ బ్యాంక్ పొదుపు ఖాతాలలో కనీస నిల్వ నిర్వహణలో కొరతకు (షార్ట్-ఫాల్) సంబంధించి, చార్జీ ని కొరత బడిన మేరకు దామాషా ప్రకారం కాకుండా; బ్యాంక్, నోటీసు ఇచ్చిన తేదీ నుండి ఒక నెలలోపు ఖాతాలో కనీస నిల్వ పునరుద్ధరించబడనట్లయితే, పొదుపు బ్యాంకు ఖాతాలలో కనీస నిల్వ నిర్వహణలో కొరతకు జరిమానా ఛార్జీలు వర్తిస్తాయి అని నోటిసు ఇవ్వకుండా, నిర్ణీత జరిమానాను వసూలు చేస్తున్నట్లు వెల్లడయ్యింది. పైన పేర్కొన్న వాటి ఆధారంగా, భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన డిపాజిట్ ఖాతాల నిర్వహణపై పేర్కొన్న ఆదేశాలను ఉల్లంఘించినందుకు, దానిపై జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని, మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖికఅంశాలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, ఆర్బిఐ (RBI) ఆదేశాల అమలు జరుగలేదని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ఆదేశాల ఉల్లంఘనం జరిగినంత మేరకు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు వొక నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాల్) పత్రికా ప్రకటన: 2023-2024/266 |