<font face="mangal" size="3">రిజర్వ్ బ్యాంక్‌చే లక్ష్మీ విలాస్ బ్యాంక్‌& - ఆర్బిఐ - Reserve Bank of India
రిజర్వ్ బ్యాంక్చే లక్ష్మీ విలాస్ బ్యాంక్పై నగదు జరిమానా విధింపు
జనవరి 06, 2017 రిజర్వ్ బ్యాంక్చే లక్ష్మీ విలాస్ బ్యాంక్పై నగదు జరిమానా విధింపు కరెంట్ ఖాతాలు తెరవడం, వాటి నిర్వహణకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించడం, ఖాతదార్లు కానివారికి, బయటివారికి బిల్ డిస్కౌంటింగ్ సౌకర్యం కల్పించడం, మీ వినియోగదారుణ్ణి తెలిసికోండి (KYC) నిబంధనలు పాటించకపోవడం వంటి అవకతవకలకు పాలుపడినందుకు, రిజర్వ్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్పై ₹ 30 మిలియన్ల నగదు జరిమానా విధించింది. తమ ఆదేశాలు/నిర్దేశాలు/మార్గదర్శాకాలు ఉల్లంఘించినందుకు, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 47 (A)(1)(c) మరియు సెక్షన్ 46(4)(i) క్రింద రిజర్వ్ బ్యాంకుకు దఖలు పరచబడిన అధికారాలతో, ఈ జరిమానా విధించడం జరిగింది. ఈ చర్య, నియంత్రణలు పాటించడంలో లోపాల కారణంగా తీసుకోబడింది. అంతేగాని, వారి ఖాతాదార్లతో బ్యాంక్ జరిపిన లావాదేవీలు, ఒప్పందాల చెల్లుబాటుపై తీర్మానంగా ఉద్దేశించబడలేదు. నేపథ్యం బ్యాంక్యొక్క ఒక శాఖలో, బిల్ డిస్కౌంటింగ్/కొనుగోలు లావాదేవీల్లో అక్రమాల గురించి రిజర్వ్ బ్యాంకుకు ఫిర్యాదు వచ్చింది. ఈ అక్రమాలను, రిజర్వ్ బ్యాంక్ పరిశోధించి, బ్యాంక్ సంజాయిషీ కోరింది. రిజర్వ్ బ్యాంక్ పరిశోధన, బ్యాంక్ సమర్పించిన సంజాయిషీ ఆధారంగా, రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన కొన్ని నిర్దేశాలు, ఉత్తరువులు ఉల్లంఘించినందుకు, బ్యాంక్కు షోకాజ్ నోటీస్ జారీ చేయబడింది. బ్యాంక్ లిఖిత పూర్వకంగా ఇచ్చిన జవాబు, వ్యక్తిగత నివేదనలు, సమర్పించిన సమాచారం, పత్రాలు పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగ్గవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ణయానికి వచ్చింది. అల్పనా కిల్లావాలా పత్రికా ప్రకటన: 2016-2017/1811 |