ది లాల్ బౌగ్ సహకార బ్యాంకు,వడోదర,గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
ది లాల్ బౌగ్ సహకార బ్యాంకు,వడోదర,గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు
పట్టణ సహకార బ్యాంకులు, ఇతర బ్యాంకులలో పెట్టే డిపాజిట్లపై భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన మార్గ దర్శకాలను ఉల్లంఘించినందుకు, “పట్టణ సహకార బ్యాంకులు- డిపాజిట్లపై వడ్డీ రేట్లు” పై 2016 సంవంత్సరపు మార్గ దర్శకాలను పాటించ నందులకు గాను ది లాల్ బౌగ్ సహకార బ్యాంకు,వడోదర,గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేది 22-08-2023 ద్వారా రు.5.00 లక్షలు (అక్షరాల అయిదు లక్షల రూపాయలు మాత్రమే ) పెనాల్టి విధించినది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)( ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది. చట్ట బద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరు బ్యాంకు తమ ఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదీవీల ప్రామాణికతకు సంబంధించినది కాదు. నేపధ్యము ఈ బ్యాంకు యొక్క 31-03-2022 తేది నాటి ఆర్ధిక పరిస్థితి ప్రామాణికముగా రిజర్వు బ్యాంకు వారు చట్ట బద్ధ తనిఖీ నిర్వహించారు .ఆ తనిఖీ నివేదికను,ముప్పు(రిస్క్) అంచనాల నివేదిక మరియు తత్సంబంధిత పత్రములను పరిశీలించిన మీదట, (i) ఈ బ్యాంకు ఇతర బ్యాంకులలో నెరపవలసిన అత్యధిక స్థూల బహిర్గత పరిమితి ని ఉల్లంఘించిందని (ii) ఈ బ్యాంకుకు, ఇతర బ్యాంకుల కు మధ్య ఉండవలసిన విచక్షణా యుతంగా నిర్ణయించబడిన కౌంటర్ పార్టీ అత్యధిక ఆర్ధిక పరిమితులను ఉల్లంఘించినదని(iii) కాల పరిమితి ముగిసిన రికరింగ్ డిపాజిట్లలో/ కాలపరిమితి డిపాజిట్లలో, వాస్తవంగా డిపాజిట్ చెల్లింపు తేది వరకు అనువర్తించే వడ్డీ రేటు ప్రకారం వడ్డీ చెల్లించలేదని గమనించడము జరిగినది. తదనుగుణంగా, పైన పొందుపరచిన అవకతవకలు జరిగినందులకు గాను, భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాలు పాటించనందులకుగాను ఈ బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వ వలసినదిగా బ్యాంకు కు నోటీసు ఇవ్వడమైనది. ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట, రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబద్డమైన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక పరమైన జరిమానాను విధించడమైనది . యోగేష్ దయాళ్ పత్రిక ప్రకటన విడుదల 2023-24/943 |