లాతూర్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్, లిమిటెడ్, లాతూర్ పై నగదుజరిమానావిధించినఆర్బిఐ
ఆగస్ట్ 25, 2015 లాతూర్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్, లిమిటెడ్, లాతూర్ పై బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, (కో ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సెక్షన్ 47A (1)(b) మరియు 46(4) ద్వారా తమకు లభించిన అధికారాల్ని వినియోగించి, రిజర్వ్ బ్యాంక్, లాతూర్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్, లాతూర్, పై రూ. 5 లక్షల నగదు జరిమానా విధించింది. ఈ జరిమానా, మీ వినియోగదారుని తెలుసుకోండి (KYC) నిబంధనలను, రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను ఉల్లంఘించినందుకు, విధించబడింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన సంజాయిషీ నోటీసుకు, ఆ బ్యాంక్ లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చింది. బ్యాంక్ ఇచ్చిన జవాబునీ, వాస్తవాలని పరిశీలించిన అనంతరం, ఉల్లంఘనలు నిరూపించబడ్డాయని, అవి నగదు జరిమానా విధించవలసినంత తీవ్రమైనవేనని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. అనిరుధ డి. జాధవ్ పత్రికా ప్రకటన: 2015-2016/490 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: