లోకమంగల్ సహకార బ్యాంక్ లిమిటెడ్, సోలాపూర్, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు
‘మీ ఖాతాదారుని తెలుసుకోండి (KYC) ’’ కి సంబంధించి ఆర్బీఐ రూపొందించిన నిర్దిష్ట నిబంధనలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా ఏప్రిల్ 23, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా లోకమంగల్ సహకార బ్యాంక్ లిమిటెడ్, సోలాపూర్, మహారాష్ట్ర, (బ్యాంక్) వారి పై ₹5 లక్షలు (ఐదు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.
మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది.
ఈ పర్యవేక్షణ ఫలితంగా ఆర్బీఐ రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించుటలో వైఫల్యం కారణంగా బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది.భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పొందిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, అలాగే బ్యాంకు సమర్పించిన అదనపు సమాచారం పరిశీలించిన తరువాత వెల్లడైన అంశాలు (i) బ్యాంకు రిస్క్ వర్గీకరణ ఆధారంగా ఖాతాల కాలక్రమ సమీక్ష నిర్వహించలేదు (ii) రిస్క్ వర్గీకరణ ఆధారంగా ఖాతాదారుల కాలక్రమ నవీకరణ (periodic updation of KYC) చేపట్టలేదన్న విషయం ఋజువైనందున సదరు బ్యాంకుపై ఆర్బీఐ నగదు జరిమానా విధింపు చర్య చేపట్టవలసివచ్చినది.
ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర ఒప్పందాల చెల్లుబాటు లేదా లావాదేవిల విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు, అంతేగాక ఇట్టి నగదు జరిమానా, కేవలం ఆర్బిఐ రూపొందించన నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినందున తీసుకున్న చర్య మాత్రమే, కావున బ్యాంకు పై చేపట్టే ఏ ఇతర చర్యలపై భారతీయ రిజర్వ్ బ్యాంకు ఎటువంటి పక్షపాతం వహించదు.
(యోగేష్ దయాల్) చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2024-2025/233
RbiTtsCommonUtility
प्ले हो रहा है
వినండి
LOADING...
0:062:49
Related Assets
RBI-Install-RBI-Content-Global
RbiSocialMediaUtility
ఈ పేజీని షేర్ చేయండి:
భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!
RbiWasItHelpfulUtility
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?ధన్యవాదాలు!
మరిన్ని వివరాలను ఇవ్వాలనుకుంటున్నాను?
మీ అభిప్రాయల కోసం ధన్యవాదాలు!మీ అభిప్రాయల కోసం ధన్యవాదాలు!