RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

104374754

లోకమంగల్ సహకార బ్యాంక్ లిమిటెడ్, షోలాపూర్ (M.H.) పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు

తేది: 20/03/2023

లోకమంగల్ సహకార బ్యాంక్ లిమిటెడ్, షోలాపూర్ (M.H.) పై
భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు

భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) మార్చ్ 14, 2023 నాటి ఆదేశం ద్వారా, లోకమంగల్ సహకార బ్యాంక్ లిమిటెడ్, షోలాపూర్ (ది బ్యాంక్) పై 3.0 లక్షల (రూ. మూడు లక్షలు మాత్రమే) జరిమానా విధించింది. నగర సహకార బ్యాంకులకు ఆర్‌బిఐ జారీ చేసిన ఆదేశాలు - 'ఎక్స్‌పోజర్ నిబంధనలు మరియు చట్టబద్ధమైన/ఇతర పరిమితులు - UCBలు' ఉల్లంఘనకు ఫై జరీమానా విధించబడింది. ఆర్‌బిఐ జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా) లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఈ జరిమానా విధించబడింది.

ఈ చర్య నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా ఉద్దేశించబడలేదు.

నేపధ్యము

మార్చి 31, 2020 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా బ్యాంకు యొక్క తనిఖీ నివేదిక, బ్యాంకు నిర్దేశిత నియంత్రణ పరిమితిని మించి నామమాత్రపు సభ్యులకు పైన పేర్కొన్న ఆర్‌బిఐ ఆదేశాలకు విరుద్ధంగా రుణాలను మంజూరు చేసిందని వెల్లడించింది. దీని ఆధారంగా, ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది.

బ్యాంక్ యొక్క ప్రత్యుత్తరం, మౌఖిక సమర్పణలను మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత, ఈ విషయంలో బ్యాంకు ద్వారా ఆర్‌బిఐ ఆదేశాల ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.

(యోగేష్ దయాల్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2022-2023/1888

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?