<font face="mangal" size="3px">రిజర్వ్ బ్యాంకుచే M/s రాధాకృష్ణా ఫైనాన్స్ ప్ర - ఆర్బిఐ - Reserve Bank of India
రిజర్వ్ బ్యాంకుచే M/s రాధాకృష్ణా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై, నగదు జరిమానా విధింపు
తేదీ: 14/12/2017 రిజర్వ్ బ్యాంకుచే M/s రాధాకృష్ణా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై, రిజర్వ్ బ్యాంకుచే ఎప్పటికప్పుడు జారీచేయబడిన నిబంధనలు అతిక్రమించిన కారణంగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934, సెక్షన్ 58G (1)(b)[సబ్ సెక్షన్ 5(aa) సెక్షన్ 58B తో కలిపి] క్రింద M/s రాధాకృష్ణా ఫైనాన్స్ లి. పై రిజర్వ్ బ్యాంక్, రూ. 1 లక్ష జరిమానా విధించినది. నేపథ్యం మార్చ్ 31, 2016 తేదీ కంపెనీ ఆర్థిక స్థితి, రిజర్వ్ బ్యాంకుచే, ఫిబ్రవరి 16, 2017 తేదీన పరిశీలించబడినది. ఈ పరిశీలనలో, కంపెనీ, సబార్డినేటెడ్ డెట్ తిరిగిచెల్లింపు విషయంలో, రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా, మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు వెల్లడయింది. ఇది, సర్క్యులర్ DNBR.(PD).CC.No.044/03.10.119/2015-16 తేదీ జులై 01, 2015, పేరా 2(1) (xxvi); మరియు (xvii) పేరా 3 అధ్యాయం II, 'PDల అంగీకారానికి మార్గదర్శకాలు 2016' పై ఆగస్ట్ 25, 2016 తేదీన జారీచేసిన సమగ్ర సర్క్యులర్‌లోని (Master Directions on Acceptance of PD Directions 2016) నిబంధనలకు, విరుద్ధం. కంపెనీ మీద జరిమానా విధించుటకు, జూన్ 07, 2017 తేదీన షో-కాజ్ నోటీస్ (SCN) జారీచేయబడినది. కంపెనీ ఇచ్చిన జవాబు సంతృప్తికరంగాలేదు. సెక్షన్ 58G (2) అనుసారంగా, వ్యక్తిగత సమావేశానికి, కంపెనీకి రిజర్వ్ బ్యాంక్, అవకాశం కల్పించినది. ఈ విషయమై నిజానిజాలు, కంపెనీ ఇచ్చిన జవాబు, వ్యక్తిగతంగా సమర్పించిన నివేదనలూ పరిశీలించిన తరువాత, పైన తెలిపిన ఉల్లంఘనలు నిరూపితమయినట్లు, అవి కంపెనీపై నగదు జరిమానా విధించదగినవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించినది. తదనుసారంగా, కంపెనీపై రూ. 1 లక్ష జరిమానా విధించినది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/1633 |