<font face="mangal" size="3">రిజర్వ్ బ్యాంక్‌చే M/s రాంకీ ఫైనాన్స్ అండ్ ఇన్ - ఆర్బిఐ - Reserve Bank of India
రిజర్వ్ బ్యాంక్చే M/s రాంకీ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ (ప్రై) లి. పై నగదు జరిమానా విధింపు.
తేదీ: 22/01/2018 రిజర్వ్ బ్యాంక్చే M/s రాంకీ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ (ప్రై) లి. పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934 (RBI Act, 1934), సెక్షన్ 58 (G) సబ్-సెక్షన్ (1), క్లాజ్ (b) [క్లాజ్ (aa), సబ్-సెక్షన్ (5), సెక్షన్ 58B తో కలిపి] క్రింద రిజర్వ్ బ్యాంక్, M/s రాంకీ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ (ప్రై) లి. పై 1 లక్ష రూపాయిల నగదు జరిమానా విధించినది. రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు జారీచేస్తున్న మార్గదర్శకాలు / ఆదేశాలు ఉల్లంఘించినందున ఈ జరిమానా విధించడం జరిగింది. నేపథ్యం M/s రాంకీ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ (ప్రై.) లి., రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా, మార్చ్ 31, 2016 నుండి, తమ పేరును M/s రాంకీ IWM ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చడంద్వారా, రిజర్వ్ బ్యాంక్ జనవరి 13, 2000 తేదీన జారీచేసిన సర్క్యులర్ పేరా 5 లోగల నిబంధనలను ఉల్లంఘించినది. జరిమానా విధించుటకై, కంపెనీకి షోకాజ్ నోటీస్ జారీ చేయబడినది. కంపెనీ ఇచ్చిన జవాబు సంతృప్తికరంగాలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934, సెక్షన్ 58G, సబ్-సెక్షన్ (2) అనుసారంగా, కంపెనీకి మౌఖిక నివేదనలు చేయుటకు అవకాశ మివ్వబడినది. ఈ విషయమై నిజానిజాలు, మౌఖిక వినతులు పరిశీలించిన పిమ్మట, ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగినవేననీ, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చినది. తదనుసారంగా, కంపెనీపై 1 లక్ష రూపాయిల జరిమానా విధించడం జరిగింది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/2002 |