<font face="mangal" size="3">M/s శ్రేష్ఠ ఫిన్‌వెస్ట్ లిమిటెడ్, చెన్నై, తమిళన&# - ఆర్బిఐ - Reserve Bank of India
M/s శ్రేష్ఠ ఫిన్వెస్ట్ లిమిటెడ్, చెన్నై, తమిళనాడు పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు
మే 22, 2023 M/s శ్రేష్ఠ ఫిన్వెస్ట్ లిమిటెడ్, చెన్నై, తమిళనాడు పై భారతీయ భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) మే 18, 2023 నాటి తమ ఉత్తర్వు ద్వారా ‘నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ - నాన్-సిస్టమికల్లి ఇంపార్టెంట్ నాన్-డిపాజిట్ టేకింగ్ కంపెనీ” లకు సంబంధించిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFCలు) నియంత్రణను స్వాధీనం చేసుకోవడం/బదిలీ చేయడం వంటి సందర్భాల్లో ఆర్బిఐ నుండి ముందస్తు అనుమతి పొందాలని ఆర్బిఐ జారీ చేసిన ఆదేశాలను పాటించనందులకు, M/s శ్రేష్ఠ ఫిన్వెస్ట్ లిమిటెడ్, చెన్నై, తమిళనాడు (కంపెనీ) పై ₹2.00 లక్షల (రెండు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 58B, సబ్-సెక్షన్ (5), క్లాజ్ (aa)తో కలిపి సెక్షన్ 58G, సబ్-సెక్షన్ (1), క్లాజ్ (b) కింద అందించబడిన అధికారాలను వినియోగించుకొని ఆర్బిఐ జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో కంపెనీ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఆర్బిఐ ద్వారా ఈ జరిమానా విధించబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, కంపెనీ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు. నేపథ్యo డైరెక్టర్ల నియామకానికి సంబంధించి మార్చి 24, 2022 నాటి కంపెనీ లేఖను పరిశీలిస్తే, మిగాతావాటితోపాటు, డైరెక్టర్ల నియామకం కోసం ఆర్బిఐ నుండి కంపెనీ ముందస్తు అనుమతి పొందలేదని వెల్లడయ్యింది. డైరెక్టర్ల నియామకాల తత్ఫలితంగా ఎన్బిఎఫ్సి నిర్వహణలో 30 శాతం పైబడి డైరెక్టర్లలో మార్పు (ఇండిపెండెంట్ డైరెక్టర్స్ మినహాయించి) జరిగింది. దీని ఆధారంగా, పై ఆదేశాలను పాటించనందుకు దానిపై జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ కంపెనీకి వొక షోకాజ్ నోటీసు జారీ చేయబడింది. నోటీసుకు కంపెనీ ఇచ్చిన ప్రత్యుత్తరమును మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖికఅంశాలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, ఆర్బిఐ ఆదేశాల అమలు జరుగలేదని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు వొక నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2023-2024/264 |