మహారాష్ట్రలోని లాతూర్‌లో గల మహారాష్ట్ర నాగరి సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్.బి.ఐ - ఆర్బిఐ - Reserve Bank of India
మహారాష్ట్రలోని లాతూర్‌లో గల మహారాష్ట్ర నాగరి సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్.బి.ఐ
మహారాష్ట్రలోని లాతూర్‌లో గల మహారాష్ట్ర నాగరి సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) 2024 ఆగస్టు 8న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.2 లక్షల(కేవలం రెండు లక్షల రూపాయల) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ(ఐఆర్‌ఏసీ) నిబంధనలపై ఆర్.బి.ఐ జారీ చేసిన కొన్ని మార్గదర్శకాలకు కట్టుబడి ఉండకపోవడంతో పాటు, బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949(బీఆర్ యాక్ట్)కు చెందిన సెక్షన్ 56తో కలుపుకుని సెక్షన్ 26ఏ కిందనున్న ప్రొవిజన్లను ఉల్లంఘించడంతో మహారాష్ట్ర నాగరి సహకారి బ్యాంకుపై ఈ ద్రవ్య జరిమానాను విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా వేసింది.2023 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్.బి.ఐ, ఆ బ్యాంకుపై చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. ఆర్.బి.ఐ మార్గదర్శకాలకు బ్యాంకు కట్టుబడి లేదని గుర్తించడంతో పాటు ఇతర సంబంధిత నిర్ధారణల ఆధారంగా, బీఆర్ చట్టంలోని ప్రొవిజన్లను, ఆర్.బి.ఐ మార్గదర్శకాలను పాటించనందుకు బ్యాంకుపై ఎందుకు ద్రవ్య జరిమానా విధించకూడదో తెలుపాలంటూ మహారాష్ట్ర నాగరి సహకారి బ్యాంకుకు షోకాజు నోటీసు జారీ చేసింది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ సందర్భంగా ఇవ్వబడిన మౌఖిక సమర్పణలు పరిగణనలోకి తీసుకున్న తదుపరి, కొన్ని రుణ ఖాతాలను ఎన్‌పీఏగా వర్గీకరించడంలో విఫలమవ్వడంతో, ఆస్తుల వర్గీకరణలో అంతరం ఏర్పడిందని గుర్తించింది. అంతేకాక, అర్హత కలిగిన మొత్తాన్ని ఖాతాదారుల విద్య, అవగాహన నిధికి నిర్దేశిత సమయంలో బదిలీ చేయలేదని ఆర్.బి.ఐ గుర్తించింది. బ్యాంక్ ద్వారా ఆర్.బి.ఐ మార్గదర్శకాల ఉల్లంఘన జరిగిందని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.ఆర్.బి.ఐ తీసుకున్న ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. అంతేకాక, ఈ ద్రవ్య జరిమానా విధింపు బ్యాంకుపై ఆర్.బి.ఐ తీసుకునే మరే ఇతర చర్యలకు పక్షపాత ధోరణిగా ఉండదు. (పునీత్ పాంచోలి) పత్రికా ప్రకటన : 2024 - 2025/952 |